Begin typing your search above and press return to search.

ముంబైలో ముదిరినా నాజూకే

By:  Tupaki Desk   |   28 Nov 2015 10:30 PM GMT
ముంబైలో ముదిరినా నాజూకే
X
ఇప్పుడంతా ముదురు భామల హాజ్ పోజుల సీజన్ నడుస్తోంది. శ్రీదేవి నుంచి కరిష్మా వరకూ అందరూ హాటు ఘాటు ఫోజులిచ్చి తెగ రెచ్చగొట్టేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు శిల్పాశెట్టి కూడా చేరిపోయింది. ఫెమినా మేగజైన్ డిసెంబర్ ఎడిషన్ కి కవర్ పేజ్ పై ఎక్కింది శిల్పా శెట్టి కుంద్రా. ఈ భామ ఫోటోలు చూస్తే ఈమెకు 40 ఏళ్లు అంటే నమ్మడం చాలా కష్టం. నమ్మడం సంగతి పక్కన పెడితే.. ట్వంటీస్ లో ఉన్నంత నాజూగ్గా ఇప్పటికీ ఎలా ఉందో అర్ధం కాని పరిస్థితి.

ఈ తరం హీరోయిన్లలో ఎవరికీ తీసిపోకుండా.. ఇంకా చెప్పాలంటే గట్టి పోటీ ఇచ్చేలా రెచ్చిపోయింది శిల్ప. తనలో తళుకు బెళుకులు ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఈమె మరీ హొయలు పోతోంది కానీ.. సాధారణంగా నార్త్ లో సెటిలైన హీరోయిన్లలో చాలామంది ఇలాగే ఉంటారు. 40ల్లో కూడా కత్తుల్లా కళకళలాడుతుంటారు. ఇంతగా స్లిమ్ గా ఉండడం, బాడీ మెయింటెయిన్ చేయడం అక్కడే కనిపిస్తుంది. అదే సౌత్ లో మాత్రం హీరోయిన్ గా కెరీర్ అయిపోయాక.. చాలామంది ఊబకాయుల్లా మారిపోతుంటారు. ఒబేసిటీకి కేరాఫ్ అడ్రస్ లా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్రన్ నే తీసుకుంటే.. సినిమాల్లో చేసినపుడు బాడీతో ఆకట్టుకుని కట్టిబడేసిన ఈ భామ.. ఇప్పుడు చాలా లావైపోయింది. రీసెంట్ గా కాస్త తగ్గే ప్రయత్నం ఏదో చేసినా.. నార్త్ లో మాదిరిగా లుక్స్ మెయింటెయిన్ చేయడం మాత్రం కుదరదు.

సిమ్రన్ ఒక్కతే కాదు... కెరీర్ క్లోజ్ అయిన హీరోయిన్లలో 90శాతం మందిది ఇదే పరిస్థితి. ఏళ్ల పాటు నోరు కట్టుకు బతికామనే ఫ్రస్టేషన్ అనుకుంటా.. ఆ తర్వాత తెగ లావైపోతుంటారు. ఏమైనా ముంబైలో ఉంటే.. ఆ స్టయిల్ - మెయింటెనెన్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్ గా ఆఫర్ వచ్చినా.. రెడీ అన్నట్లుగా ఉంటారు. అలానే కదా.. కాజోల్ ఇప్పటికీ షారూక్ పక్కన హీరోయిన్ గా చేయగలుగుతోంది.