Begin typing your search above and press return to search.

బాబీని భయపెడుతున్న జైలవకుశ

By:  Tupaki Desk   |   15 July 2017 6:56 AM GMT
బాబీని భయపెడుతున్న జైలవకుశ
X
రైటర్ టర్న్ డైరెక్టర్ కే.యస్.రవీంద్ర అలీయాస్ బాబీ ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి జూనియర్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎందుకంటే బాబీ డైరెక్షన్ గ్రాఫ్ ఆశించినంతగా లేకపోవడమే, రవితేజ - బాబీ కాంబినేషన్ లో వచ్చిన పవర్ అంతంత మాత్రంగానే ఆడింది, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన సర్ధార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయింది.

అయితే బాబీకి ఈ డ్రాప్ ఫొఫైల్ ఉన్నప్పిటికీ యన్టీఆర్ పిలిచి జైలవకుశ ప్రాజెక్ట్ ని అప్పజెప్పాడు. దీంతో ఎలాగైన ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని బాబీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కానీ ఆ అతి జాగ్రత్తే బాబీ కొపంముంచే స్థాయికి చేరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని, ప్రొడక్షన్ హౌస్ తరుపు నుంచి బాబీ పై ఒత్తిడి వస్తుందని తెలిసింది.