అంచనాలు పెంచి నీరుగార్చేశాడు

Fri Jan 11 2019 17:44:35 GMT+0530 (IST)

రామ్ చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. ఇప్పటికే క్రిష్ మరియు వివేగం చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన వివేక్ ఒబేరాయ్ తప్పకుండా ఈ చిత్రంలో విలన్ గా రామ్ చరణ్ కు సరి పోటీ ఇస్తాడని మెగా ఫ్యాన్స్ భావించి సినిమాపై అంచనాలను పెంచుకున్నారు. ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ పాత్ర హైలైట్ గా ఉంటుందని దర్శకుడు బోయపాటి కూడా మొదటి నుండి చెబుతూ వచ్చాడు.వివేక్ ఒబేరాయ్ ని పట్టుబట్టి ఈ చిత్రంలో నటింపజేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన డిమాండ్ చేసిన పారితోషికం ఇచ్చి ఈ చిత్రంలో నటింపజేశారు. అంతగా హైప్ పెంచడంతో విలన్ పాత్ర గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే అయ్యో అన్నట్లుగా ఉంది.

బోయపాటి సినిమాల్లో విలన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాడు. కాని ఈ చిత్రంలో మాత్రం అంత పవర్ ఫుల్ గా చూపించడంలో విఫలం అయ్యాడు. ఒకటి రెండు సీన్స్ లో తప్ప వివేక్ ఒబేరాయ్ ని దర్శకుడు బోయపాటి ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో చూపించలేదు. దాంతో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.