ట్రైలర్ టాక్: మోసగాడి విశ్వరూపం

Sat Dec 08 2018 13:08:43 GMT+0530 (IST)

సత్యదేవ్ హీరోగా గోపి గణేష్ దర్శకత్వంలో రూపొందిన బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ విడుదలైంది. తమిళ్ బ్లాక్ బస్టర్ సతురంగ వెట్టై రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నందిని శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని అమాయకులైన ప్రజలను మోసం చేయడం ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన యువకుడి కథే ఈ బ్లఫ్ మాస్టర్. కథానాయకుడి పాత్ర తీరుతెన్నులను ట్రైలర్లోనే చూపించి ఆసక్తి రేపారు. మీ ఖాతాలో ఉన్న బాలన్స్ బ్యాంకు అకౌంట్ నెంబరంత మారిపోతుంది అని చెప్పించడం ద్వారా హీరో పాత్ర ఎన్ని మాయ మాటలు చెబుతుందో అర్థమైపోతుంది.ఇంత డబ్బు ఏం చేసుకుంటావ్ అని అడిగిన పోలీస్ ఆఫీసర్ తో అన్నింటికీ డబ్బే మూలం అని చెప్పించడం కూడా థీమ్ ని స్పష్టంగా చూపిస్తోంది. సత్యదేవ్ చాలా కాలం తర్వాత ఎక్కువ స్పాన్ ఉన్న పాత్రను దక్కించుకున్నాడు. హీరో పాత్రను డిజైన్ చేసిన స్వభావానికి తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్ ని కూడా  బాగా చూపించాడు. హీరోయిన్ నందిత శ్వేతను ఎక్కువగా చూపలేదు. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ సినిమా మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. దాశరధి కెమెరా పనితనం కూడా బాగుంది.

మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్లకు బ్లఫ్ మాస్టర్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. తమిళ్ లో పెద్దగా పరిచయం లేని నటులతో తీస్తే తెలుగు వెర్షన్ లో మాత్రం సిజ్జు-బ్రహ్మాజీ-ఆదిత్య నందన్-30 ఇయర్స్ పృథ్వి ఇలా అందరిని తెలిసినవాళ్లనే పెట్టుకోవడం ప్లస్ గా కనిపిస్తోంది. డిసెంబర్ 28 విడుదల కానున్న బ్లఫ్ మాస్టర్ లో ఓ మోసగాడి జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. కోడి మీద జాలి పడితే చికెన్ 65 ఎలా తినగలం అనే డైలాగ్ బాగా పేలింది.