Begin typing your search above and press return to search.

షారూక్ టైటిల్ పై రణబీర్ ని తిట్టాలి

By:  Tupaki Desk   |   23 July 2017 9:21 AM GMT
షారూక్ టైటిల్ పై రణబీర్ ని తిట్టాలి
X
షారూక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జబ్ హ్యారీ మెట్ సెజల్ ట్రైలర్ వచ్చేసింది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా జనాలను ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. కింగ్ ఖాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులను మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది ఈ ట్రైలర్.

ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ తో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ టూర్ లో ఉన్న షారూక్ ఖాన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. సెజల్ ఎంగేజ్మెంట్ వేడుక బ్యాక్ డ్రాప్ తో ఈ ట్రైలర్ ను లాంఛ్ చేయాలన్న షారూక్ ఆలోచన సూపర్ హిట్ అయింది. అయితే.. ఈ సినిమా టైటిల్ కొంతమందినే మెప్పించలేదనే టాక్ ఉంది. దీనిపై దర్శకుడు ఇంతియాజ్ ఆలీ రియాక్ట్ అయ్యాడు. 'ఈ విషయంలో రణబీర్ కపూర్ ను బ్లేమ్ చేయండి' అని ఇంతియాజ్ అనగానే.. 'మేం త్వరలో ఈ టైటిల్ విషయంలో ఓ వెబ్ సైట్ ప్రారంభించబోతున్నాం. వెబ్ సైట్ అడ్రస్ త్వరలో చెబ్తాం. మీరంతా ఆ సైట్ ను విజిట్ చేసి.. టైటిల్ పై మీ కంప్లెయిట్స్ ఇవ్వండి' అని చెప్పింది హీరోయిన్ అనుష్క శర్మ.

అనుష్క మాటలను కంటిన్యూ చేసిన దర్శకుడు.. 'అవును.. రణబీర్ తను చాలా స్మార్ట్ అనుకుంటాడు. సోషల్ మీడియాలో తాను లేను కాబట్టి తనను ఎవరేం అనలేరని అనుకుంటూ ఉంటాడు. అందుకే మేం ప్రారంభించే సైట్ లో మీ కంప్లెయింట్స్ అన్నీ పోస్ట్ చేయండి' అని చెప్పాడు ఇంతియాజ్ ఆలీ. అంటే ఈ టైటిల్ రణబీర్ కపూర్ సజెస్ట్ చేశాడన్నమాట. ఇంతకీ టైటిల్ అంత బ్యాడ్ గా ఉందంటారా?