Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మల మల్టీస్టారర్‌

By:  Tupaki Desk   |   21 Jan 2019 2:04 PM GMT
ముద్దుగుమ్మల మల్టీస్టారర్‌
X
ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే హీరోల మల్టీస్టారర్‌ మాత్రమే వస్తాయి. కాని త్వరలో తెలుగులో హీరోయిన్స్‌ మల్టీస్టారర్‌ రాబోతుంది. నలుగురు అప్‌ కమింగ్‌ ముద్దుగుమ్మలతో కొత్త దర్శకుడు బాలు ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా జరుగుతోంది. రెండవ షెడ్యూల్‌ ను గోవాలో ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా సూర్య వర్సెస్‌ సూర్య ఫేం త్రిధ చౌదరి, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ఫేం ధన్య బాలకృష్ణ, జంబలకడి పంబ ఫేం సిద్ది ఇద్నాన్ని, నెపోలియన్‌ ఫేం కోమలి ప్రసాద్‌ లు నటిస్తున్నారు. హిమ బింధు వెలగపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అల్రా మోడ్రన్‌ అమ్మాయిలు స్వేచ్చ కోరుకుంటూ బయటకు వెళ్లి వారు పడ్డ ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ అనే కాన్సెప్ట్‌ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. వచ్చే నెలలో గోవాలో మేజర్‌ షెడ్యూల్‌ ఉంటుందట. సినిమాను మే లో విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.