మరో సినీ హీరోకి బీజేపీ టికెట్ కన్ఫర్మ్!

Mon Apr 15 2019 17:21:49 GMT+0530 (IST)

భోజ్ పురీ సూపర్ స్టార్ తెలుగులో కూడా విలన్ గా మంచి గుర్తింపు ఉన్న నటుడు రవి కిషన్ కు భారతీయ జనతా పార్టీ ఎంపీ టికెట్ దక్కింది. యూపీలోని గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి రవిశంకర్ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో రవి కిషన్ పేరుంది.ఇప్పటికే పలువురు సినీ తారలకు బీజేపీ ఈ సారి ఎంపీ టికెట్లను కేటాయించింది. వారిలో జయప్రద హేమమాలిని వంటి పాత వారున్నారు.  జయప్రద  తొలిసారి బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తూ ఉన్నారు. దక్షిణాదిన కూడా మలయాళీ స్టార్ హీరో సురేష్ గోపిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది.

మరింతగా సినీ గ్లామర్ మీద ఆసక్తి చూపుతూ ఉంది కమలం పార్టీ. అందులో భాగంగా గోరఖ్ పూర్ నుంచి రవి కిషన్ కు టికెట్ ను ఖరారు  చేసింది.

భోజ్ పురి మాట్లాడుకునే ప్రాంతంలో రవి కిషన్ కు స్టార్ డమ్ ఉంది. పెద్దగా నాణ్యత నవ్యత ఉండని భోజ్ పురి సినిమాల పాలిట ఇతడు స్టార్.  ఇక తెలుగులో కూడా ఇతడు పలు సినిమాల్లో నటించాడు. విలన్ గా తన నటనతో మెప్పించాడు కూడా. మరి ఈ నటుడు బీజేపీ తరఫున నెగ్గి.. ఎంపీగా లోక్ సభలోకి అడుగుపెడతాడేమో చూడాలి.