హ్యాపీ బర్త్ డే...టూ మెగా 'హీరో'?!

Mon Feb 11 2019 10:06:19 GMT+0530 (IST)

మెగా స్టార్ చిరంజీవి! ఈ పేరు వింటేనే నటన అన్న పదం సైతం తుళ్ళి పడుతుంది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పునాది రాళ్ళ నుంచి మెగాస్టార్ గా ఆయన ఎదిగిన వైనం ఎంతో మంచి ఆదర్శం. అయితే మన టాలీవుడ్ లో ఏ ఫ్యామిలీ నుంచి రానంతగా మెగాస్టార్ కుటుంభం నుంచి దాదాపుగా అత్యధిక మంది హీరోలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు అని అంటే అతిశయోక్తి కాదు.ఇదిలా ఉంటే ఈ మెగా హీరోల్లో ఒకరైన మెగాస్టార్ కి అల్లుడు వరుస అయిన 'కల్యాణ్ దేవ్' పుట్టిన రోజు ఈ రోజు. గత ఏడాది 'విజేత' సినిమాతో మన ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో - సినిమా ఫలితం ఎలా ఉన్నా - యాక్టర్ గా మాత్రం మంచి మార్కులే వేయించుకున్నాడు అని తెలుస్తుంది. అదే క్రమంలో తన రెండో సినిమాగా 'రిజ్వాన్-ఎంటర్ టైన్  మెంట్స్'లో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ రోజు ఈ మెగా స్టార్ అల్లుడి పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా యూనిట్ 'హ్యాపీ బర్త్ డే కల్యాణ్ దేవ్' అంటూ ఈ సినిమాలో ఒక స్టిల్ ను పోస్టర్ రూపంలో విడుదల చేసింది. ఒకరకంగా ఇదే ఫస్ట్ లుక్ అనుకోండీ.

ఈ పోస్టర్ లో మంచి స్టైలిష్ గా ఉన్నాడు మన మెగా కుర్రాడు. అయితే తొలి సినిమా కమర్షియల్ హిట్ కాకపోవడంతో ఈ సినిమా తనకు మంచి మైలెజ్ ని ఇస్తుంది అని కల్యాణ్ దేవ్ నమ్ముతున్నాడు. ఇక ఈ చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తూ ఉండగా - రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పై కుషి - రిజ్వాన్ ఇద్దరూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క మన థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే కల్యాణ్ దేవ్ సెకెండ్ మూవీ - ఫస్ట్ స్టిల్ ఆదరహో అనిపించేలా ఉంది...మరి సినిమా కూడా అదే రేంజ్ లో వచ్చి - భారీ హిట్ అయ్యీ - కల్యాణ్ కి మంచి బ్రేక్ ని ఇవ్వాలని మనస్పూర్తిగా ఆశిస్తూ...హ్యాపీ బర్త్ డే...టూ మెగా 'హీరో''!