Begin typing your search above and press return to search.

24లో ఇంపార్టెంట్ కేరక్టర్ అదా

By:  Tupaki Desk   |   5 May 2016 1:30 PM GMT
24లో ఇంపార్టెంట్ కేరక్టర్ అదా
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 24 విడుదల కాబోతోంది. కాలంలో ప్రయాణం చేసే కాన్సెప్ట్ కావడం, మనం వంటి విభిన్నమైన చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడంతో.. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఈ మూవీలో సూర్య 3 పాత్రలు, 5 విభిన్నమైన గెటప్స్ లో కనిపంచనుండడం 24పై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.

ఓ సైంటిస్ట్ - ఓ వాచ్ మెకానిక్ - ఓ విలన్.. ఇవీ సూర్య చేస్తున్న పాత్రలు. హీరోయిన్లుగా సమంత - నిత్యామీనన్ లు నటించగా.. వీరితో పాటు తెలుగు యాక్టర్ అజయ్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇంతమంది హేమాహేమీలు సినిమాలో ఉండగా.. ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ గురించి ఇప్పుడో విషయం బైటకొచ్చింది. 24లో అత్యంత ప్రధానంగా ఓ గద్ద కనిపిస్తుందట. పక్షుల్లో గద్దకు జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. గద్దకు సగటు ఆయుష్షు 70 ఏళ్లు. అంటే ప్రస్తుతం ఓ మనిషి ఆయువుతో సమానం అన్నమాట.

అందుకే ఈ మూవీలో గద్దకు ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ ఇచ్చాడట డైరెక్టర్ విక్రమ్. మూవీలో దీని పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గాను, సినిమాను మలుపు తిప్పేది గాను ఉంటుందని తెలుస్తోంది. మరి గద్దను స్టోరీతో ఎలా లింక్ చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే.. ఇదేమీ అఫీషియల్ న్యూస్ కాదు కానీ.. సినిమాకి సంబంధించిన యూనిట్ సీక్రెట్ గా చెబుతున్న ఓ గుసగుస మాత్రమే.