నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది

Sat Aug 12 2017 14:50:15 GMT+0530 (IST)

ఏ మనిషి జీవితంలోనైనా ప్రేమ - పెళ్లి అనేవి చాలా  ముఖ్యమైన విషయాలు. అవి ఒక్కసారే జరగుతాయి అనే వాదన ఇప్పుడు పూర్తిగా సమసిపోయింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ప్రేమలో తొందరగా పడుతున్నారు పెళ్లిళ్లు చేసుకొని అంతే తొందరగా పెటాకులు చేసుకుంటున్నారు. అందుకే ఒక పెద్దావిడ ఒకసారి ఏమి చెప్పింది అంటే జీవితంలో ఓ రెండు మాత్రం నెమ్మదిగా చేయాలి. ప్రార్థించటం - ప్రేమించటం ఎంత నెమ్మదిగా చేస్తే అంతా బలంగా మారుతుంది ఆ బంధం. అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోయిన్ తన పెళ్లి బంధం బలపడటానికి ప్రతి ఏటా పెళ్లి చేసుకోవాలి అని భావిస్తుంది.

‘ఎలోన్’ చిత్రంలో జంటగా నటించిన బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ 2016 లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ముంబయిలో గురువారం జరిగిన ‘ది గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా వెళ్లింది. అక్కడ మీడియా ముందు మాట్లాడుతూ “నా పెళ్ళికి అన్నీ పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలిసి వచ్చింది. చాల హడావిడిగా జరిగిపోయింది. వైభవంగా జరగటం కోసం అందరికీ గుర్తుండి పోయేవిదంగా చేయడానికి కష్టపడవలిసి వచ్చింది. అలా చేయాలి అంటే చాలా మంది సహకారం కావాలి బోలెడు టైమ్ ఖర్చు అవుతుంది అని చెప్పింది. నాకు అయితే మళ్ళీ మా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. ఒకసారి ఏంటి కుదిరితే ప్రతీ ఏటా మా పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది.

పెళ్ళైనప్పటి నుండి ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో  గడిపిన చాలా  మధుర అనుభవాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పటికీ అప్పుడు చెబుతూనే ఉంటుంది. బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లి కి ఒక ఏడాది పూర్తికావడంతో ఆ మధ్య ఒక వీడియోను కూడా విడుదల చేసింది బిపాసా. సెక్సీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బిపాసా బసు ఈమధ్య తన సినిమా జోరు తగ్గింది అనే చెప్పాలి.