Begin typing your search above and press return to search.

భార్యాభర్తల హాట్ అండ్ సెక్సీ యోగా

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:20 PM GMT
భార్యాభర్తల హాట్ అండ్ సెక్సీ యోగా
X
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు కెరీర్ లో ఉన్నన్ని సంవత్సరాలు హాట్ హాట్ లుక్స్ తో జనాలకు మత్తెక్కించింది. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న ఈ భామ.. సినిమాలకు దూరమైపోయింది. పెళ్లి తర్వాత కూడా వెకేషన్స్ కు వెళ్లి అక్కడి నుంచి హాట్ ఫోటోలతో బాగానే రచ్చ చేశారు బిపాషా అండ్ కరణ్.

ఇవాళ ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా ఈ వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ కలిసి స్పెషల్ ఆసనాలు వేశారు. ఇద్దరూ స్పెషల్ గా యోగాసనాలు వేసి కొత్తగా ట్రై చేశారు. యోగ డే సందర్భంగా ఆసనాలు వేయడంలో విచిత్రమేమీ లేదు కానీ.. ఇక్కడ ఇద్దరూ ఆసనాలు వేయడమే అసలైన విశేషం. మామూలుగానే తను యోగ చేసే వీడియోలను సోషల్ మీడియాలో చూపిస్తుంటుంది బిపాషా. కానీ ఇక్కడ మాత్రం.. ఈ ఇద్దరూ కలిసి ఆసనాలు వేసేస్తున్నారు. ఒకరిపై ఒకరు.. ఒకరి కింద మరొకరు కనిపిస్తూ.. మరీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఈ ఆసనాలు. ఈ ఆసనాలకు బిపాషా జంట ఏం పేరు పెడుతుందో తెలీదు కానీ.. ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి హాట్ అండ్ సెక్సీ ఆసనాలు చూపించడం మాత్రం హాట్ హాట్ ఇష్యూ అయిపోయింది.

ఇక బిపాషా బసు సినిమాల సంగతేమీ ఇంకా తేలలేదు. 2015లో వచ్చిన అలోన్ మూవీలో కనిపించిన బిపాషా.. ఆ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులను బొత్తిగా కనికరించడం లేదు. ఆ మధ్యన బిపాషా గర్భవతి అయిందంటూ వచ్చిన వార్తలు కూడా.. ఈ యోగ పిక్చర్స్ తో కొట్టుకుపోయినట్లే.