వెండితెరపై బయోపిక్ ల హవా

Tue Jul 10 2018 11:42:39 GMT+0530 (IST)

టాలీవుడ్ - కోలీవుడ్  - బాలీవుడ్ ఇలా అన్ని భాషల చిత్రసీమ బయోపిక్ లతో హోరేత్తిపోతోంది. దేశవ్యాప్తంగాను - అంతర్జాతీయ స్దాయిలోను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రసిద్దుల జీవితగాథలను వెండతెరకెక్కిస్తున్నారు. వీటిలో రాజకీయ నాయకులు - క్రీడాకారులు - సినీ నటినటుల జీవిత చరిత్రలు ఉండడం విశేషం. మహానటి సావిత్రి పై ఇటీవలే విడుదల చేసిన మహానటి చిత్రం సూపర్ హిట్ కొట్టింది. అంతకు ముందు ‍భారత మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోని పై బాలీవుడ్ లో ఓ బయోపిక్ వచ్చింది. ఆ చిత్రం ఇతర భాషలలోకి కూడా అనువాదమై విజయం సాధించింది.



తెలుగు - తమిళ భాషలలో తీసిన మహానటి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహానటుడు - తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్.టి. రామరావు జీవితం పై ఎన్.టి.ఆర్ పేరుతో ఆయన కుమారుడు నటుడు - ఎంఎల్ ఎ  బాలక్రిష్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకులు క్రిష్. ఎన్.టి.ఆర్  పాత్రలో బాలక్రిష్ణే నటిస్నున్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ప్రముఖ మహిళా క్రికెటర్ - భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిధాలి రాజ్ బయోపిక్ ను వచ్చే సంవత్సరం తీయనున్నారు.

తనపై తీస్తున్న బయోపిక్ కు మిధాలి రాజ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే తన చిత్రంలో తన పాత్రను బాలివుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా పోషించాలని మిధాలి రాజ్ కోరినట్లు సమాచారం. తన మనోభావాలకూ ప్రియాంక చోప్రా మనోభావాలకూ పోలిక వుందని మిధాలి రాజ్  చెబుతున్నారు.

భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ ను కూడా ఓ నిర్మాణ సంస్ద తెరక్కెకించనుంది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రను ప్రముఖ నటుడు రణ్ వీర్  సింగ్ పోషిస్తాడని అంటున్నారు. ఇక మహానటి చిత్రంలో తమ తండ్రి జెమనీ గణేషన్ ను విలన్ గా చూపించారని వాస్తావాలతో కూడిన బయోపిక్ ని తామే నిర్మిస్తామని జెమిని గణేషన్ కుమార్తెలు ప్రకటించారు. కధా చర్చలు జరుగుతన్న  ఈ బయోపిక్ ను తెలుగు - తమిళ భాషల్లో నిర్మించనున్నారు. ఇక తమిళ రాజకీయాలలో అరంగేట్రం చేయనున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై కూడా ఓ బయోపిక్ సిద్దమౌతున్నట్లు సమాచారం. తెలుగు ప్రజల ఆరాధ్యుడు - ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎంతో సేవ చేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్ షూటింగ్ వడివడిగా జరుగుతోంది. ఈ చిత్రంలో వైె.ఎస్.రాజశేఖర రెడ్డి పాత్రను ప్రఖ్యాత మళయాల నటుడు మమ్ముటి పోషిస్తున్నారు. ఇలా భారత చిత్రసీమలో ఇప్పుడు బయోపిక్ ల హావా హోరెత్తుతోంది.