Begin typing your search above and press return to search.

‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్.. క్రిమినల్ పనులు

By:  Tupaki Desk   |   24 Feb 2018 9:48 AM GMT
‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్.. క్రిమినల్ పనులు
X
హిందీలో ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ సందర్భంగా అనేక వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి చాలా త్వరగా ఎలిమినేట్ అయిన జుబేర్ అనే పార్టిసిపెంట్ ఈ షో మీద.. దాని హోస్ట్ సల్మాన్ మీద తీవ్ర ఆరోపణలు చేయడం.. తనను హౌజ్ లోపల తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు.. తాను ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు చెప్పడం.. సల్మాన్ మీద కేసు కూడా పెట్టడం తెలిసిన సంగతే. అప్పట్లో ఈ వివాదం చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత జుబేర్ వార్తల్లో లేడు. ఐతే ఇప్పుడు జుబేర్ పేరు మరో రకంగా వార్తల్లోకి వచ్చింది. అతను ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా ప్రతినిధిని కోటి రూపాయల డబ్బు కోసం బెదిరించడం గమనార్హం.

తన పేరు ఉస్మాన్ చౌదరిగా చెప్పుకున్న జుబేర్.. తాను దావూద్ ఇబ్రహీం.. ఛోటా షకీల్ ల అనుచరుడినని.. తాను పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నానని.. తనకు కోటి రూపాయలు ఇవ్వాలని ఆ మహిళను బెదిరించాడు. దీంతో ఆమె ముంబయి పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఫోన్ చేసి బెదిరించింది బిగ్ బాస్ పార్టిసిపెంట్ జుబేర్ అని తేల్చారు. ‘బిగ్ బాస్’లో పాల్గొన్నపుడే జుబేర్ క్రిమినల్ బ్యాగ్రౌండ్ గురించి చర్చ జరిగింది. అతను సల్మాన్ తో తీవ్ర వాగ్వాదానికి దిగడం.. బెదిరించేట్లు మాట్లాడటం చూసి అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతడిలోని మరో కోణం బయటపడింది. ఇలాంటి వాడిని ‘బిగ్ బాస్’కు ఎలా ఎంపిక చేశారంటూ అందరూ మరోసారి ఆశ్చర్యపోతున్నారు.