బిగ్ బాస్ ఫిట్టింగ్: కౌశల్ టార్గెట్

Tue Sep 18 2018 14:27:43 GMT+0530 (IST)

బిగ్ బాస్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చేసుకుంది. ఇన్నాళ్లు అందరూ కలిసి కుట్రపన్ని ఒంటరిని చేశారని బాధపడుతున్న కౌశల్ పై ఇంటిసభ్యులందరూ ఒంటికాలిపై లేచారు. తనీష్ గీత రోల్ రైడా దీప్తి సామ్రాట్ లు ఏకిపారేశారు. కౌశల్ తప్పులను ఎత్తిచూపుతూ కడిగేశారు. ఒకానొక సమయంలో తనీష్ కౌశల్ కు మధ్య గొడవ  పెద్దది అయ్యింది. కొట్టుకుంటారేమోనని అనిపించింది. దీనంతటికి బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగే కారణం..ఆది నుంచి బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ వన్ మ్యాన్ ఆర్మీలాగే ప్రవర్తిస్తున్నాడు. ఎవరినీ కలవకుండా.. ఎవరితోనూ సాన్నిహిత్యం నెరపకుండా తన ఆట తాను ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కౌశల్ ఇంటి కెప్టెన్ కాకుండా ఇంటిసభ్యులంతా అతడికి వ్యతిరేకంగా మారారు. ఇప్పుడు గడిచిన రెండు వారాలు ఎంతో కీలకం. ఫైనల్ చేరడానికి ఈ రెండు వారాలు ఆడే టాస్క్ లే ప్రధానం. కానీ కౌశల్ ఇక్కడే చక్రం తిప్పాడు. ఇప్పటికే సీజన్ మొత్తం నామినేట్ అయిన కౌశల్.. ఇంటికెప్టెన్ గా ఎవరూ కాకుండా.. వారికి ఫైనల్స్ చేరేందుకు ఇమ్యూనిటి దక్కకుండా సంచాలకుడిగా కుట్ర చేశాడు. ఇదే విషయాన్ని ఆదివారం నాని.. సోమవారం బిగ్ బాస్ కూడా ఎత్తిచూపి కౌశల్ ను తప్పుపట్టాడు. దీంతో రగిలిపోయిన ఇంటిసభ్యులు తమకు అన్యాయం చేస్తావా అంటూ కౌశల్ పై మండిపడ్డారు.

టిట్ ఫర్ టాట్ అంటూ కౌశల్ అందరితోనూ గట్టిగానే వాదించాడు. ఇలా బిగ్ బాస్ లో ఆదినుంచి అన్యాయమై పోయిన కౌశల్.. ఫైనల్స్ వేళ ఇంటిసభ్యులకు ఇచ్చిన షాక్ మామాలుగా లేదు. దీనికి రగిలిపోయిన హౌస్ మేట్స్ నెత్తినోరు బాదుకొని కౌశల్ బండారాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.