బిగ్ బాస్ బాగా హెల్ప్ చేశాడబ్బా

Mon Sep 25 2017 23:29:30 GMT+0530 (IST)


తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 1 ఇప్పుడు పూర్తయిపోయింది. ఆరంభంలో అంతగా ఆసక్తి క్రియేట్ చేయలేకపోయినా.. ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ తో షోను లీడ్ చేసేశాడు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం.. ఎన్టీఆర్ హోస్టింగ్ కేపబిలిటీస్. అయితే.. స్టార్స్ ను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. కానీ షో మాత్రం సూపర్ హిట్ కావడం విశేషం.బిగ్ బాస్ లో పాల్గొన్న వ్యక్తులు భారీ మొత్తమే పారితోషికం అందుతుందని చెప్పడంలో సందేహాలుండవు. చివరగా విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ దక్కినా.. రెండు నెలలకు పైగా ఇక్కడ గడిపినందుకు పెద్ద మొత్తమే గిడుతుంది. పలువురు సెలబ్రిటీలకు.. ఈ బిగ్ బాస్ షో తిరిగి జీవం పోసిందని చెప్పచ్చు. పెద్ద సినిమాల్లో అడపాదడపా కనిపించడం తప్ప.. కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేకపోతున్న ఓ హీరోకు.. బిగ్ బాస్ కారణంగా బోలెడంత ఫేమ్ వచ్చింది. రెండేళ్ల సంపాదనను ఈ రెండు నెలల్లో అందుకోగలిగాడట. అలాగే ప్రస్తుతం వివాదాలు తప్ప సినిమా అవకాశాలు అంతగా లేని ఓ నటికి కూడా పెద్ద మొత్తంలో ముట్టింది. దీంతో వ్యాపారాలు ప్రారంభించే యోచనలో ఆమె ఉందని తెలుస్తోంది. అలాగే కొన్ని సినిమా అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయట.

ఆ మధ్య ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్న ఓ హీరోకు.. బిగ్ బాస్ షో కారణంగా తిరిగి కోలుకునే అవకాశం దక్కిందని తెలస్తోంది. అలాగే ఓ సింగర్ కూడా ఈ కార్యక్రమం తర్వాత అవకాశాలు తెగ వస్తున్నాయని అంటున్నారు. మీడియం రేంజ్ సెలబ్రిటీలతో షోని రక్తి కట్టించిన ఎన్టీఆర్ కు అందరికంటే పెద్ద మొత్తం అందుతుందనే సంగత తెలుసు కదా.