ఒకే సెట్ పదే పదే.. పొదుపు పథకమా?

Thu Jan 24 2019 13:24:33 GMT+0530 (IST)

ఒక సెట్ వేయడం.. అందులో పది సినిమాల షూటింగులు చేయడం.. ఒకే దెబ్బకు పది పిట్టలు చందమిది. ఖర్చు ఒకటే.. కానీ పది సినిమాలకు పనైపోతోంది. ఈ ఐడియాని చాలా కాలంగానే టాలీవుడ్ నిర్మాతలు ఫాలో చేస్తున్నారు. సెట్ వేసే ముందే పది మంది నిర్మాతలు పెట్టుబడులు షేర్ చేసుకుని ఈ సెట్ వేస్తారా..?  లేక అవసరానికి సెట్ ఉపయోగించుకునే వాళ్లంతా రెంట్లు చెల్లిస్తారో తెలీదు కానీ మొత్తానికి పని విజయవంతంగా పూర్తవుతోంది. ఈ పద్ధతి ఖర్చు తగ్గించేందుకు కాస్ట్ ఫెయిల్యూర్ ని అడ్డుకునేందుకు ఓ తరుణోపాయం అని చెప్పొచ్చు.ఇదివరకూ మంచు ఫ్యామిలీ హీరోలు నటించిన ఓ సినిమా కోసం `గంధర్వమహల్ సెట్` ని వేశారు. మణికొండ - పైప్ లైన్ ఏరియాలో ఆ సెట్ చాలా కాలం పడగొట్టకుండా అలానే ఉంచారు. ఇందులో అవసరం మేర మోడిఫై చేసుకుని చాలా సినిమాల్ని తెరకెక్కించారు. వరుసగా పలు చిత్రాల కోసం రీమోడల్ చేశారు. ఆ తర్వాత బీటలు వారాక కూల్చేశారట. అలాగే అక్కినేని ఫ్యామిలీ సినిమా `మనం` కోసం అన్న పూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ ని మోడిఫై చేసి సుశాంత్ సినిమా కోసం ఉపయోగించారు. అందులో `సోగ్గాడే చిన్ని నాయన`తో పాటు అక్కినేని సినిమాలెన్నో తెరకెక్కించారని ప్రచారమైంది.

తాజాగా `బిగ్ బాస్` సెట్ ని ఇలానే వాడేస్తున్నారట. బిగ్ బాస్ `సీజన్ -1` కోసం ముంబైలో హిందీ `బిగ్ బాస్` సెట్ ని వాడుకున్నారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేసిన బిగ్ బాస్- 2 సెట్ ని అన్నపూర్ణ  ఏడెకరాల్లో నిర్మించారు. ఈ సెట్ పనైపోయాక కూడా ఆదాయం తెచ్చిపెడుతోందిట. ఇందులోనే `కథానాయకుడు` కీలక సన్నివేశాలు కొన్ని తెరకెక్కించారు. అలాగే టీవీ సీరియళ్లు ప్రోగ్రామ్స్ తెరకెక్కిస్తున్నారట. సినిమాలు  ప్రోగ్రామ్స్ రూపంలో రెంటు వస్తోందిట. ఈ తరహాలోనే ఎన్నో చేస్తున్నారు... ఒకే సెట్ ని ఇలా మళ్లీ మళ్లీ వినియోగించడం ద్వారా డబ్బు ఆదా అవుతోంది. ప్రయోజనాలెన్నో కనిపిస్తున్నాయి. ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ లాగా.. ఇదోరకం ఇన్ బిల్ట్ డబ్బు ఆదా ట్యాలెంట్ అని చెప్పొచ్చు. సాధ్యమైనంత దగ్గరలో సెట్ అందుబాటులో ఉంటే ఔట్ స్కర్ట్స్ కి వెళ్లాల్సిన రవాణా ఖర్చు ఆదా అయిపోతోందిట. అన్నన్న.. వ్వాటే ప్లాన్ గురూ!!