అన్నపూర్ణతో బిగ్ బాస్ డీల్!

Thu Aug 09 2018 22:00:21 GMT+0530 (IST)

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసాక మంచి పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ రేంజ్ లో కాకపోయినా నాని చేతిలోకి వచ్చాక ఓ మాదిరిగా బాగానే రన్ అవుతూ స్లో పాయిజన్ లాగా వర్క్ అవుట్  చేసుకుని రేటింగ్స్ కూడా బాగానే తెచ్చుకుంటోంది. ఈ స్ఫూర్తితో బిగ్ బాస్ ని కాంటిన్యూ చేసేందుకు స్టార్ మా సిద్ధమవుతున్నట్టుగా తాజా సమాచారం. గతంలోలాగా గ్యాప్ ఇవ్వకుండా హిందీ తరహాలో వరుసగా సీక్వెల్ ని కొనసాగించేలా ప్రణాళిక వేస్తున్నారట. ఇందులో భాగంగా ఇప్పుడు సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియోలోనే రోజుకి 5 లక్షలు అద్దె చెల్లించే విధంగా ఒప్పందం జరిగిందని టాక్. అది కూడా బిగ్ బాస్ 3 ప్లస్ 4 రెండూ సిరీస్ లకు కలిపి ఇది సెట్ చేసుకున్నారట. అంటే ఇప్పుడు రన్ అవుతున్న షో పూర్తయ్యాక  ఇది ఆగదన్న మాట. మరి యాంకర్ గా నానినే కొనసాగుతాడా లేక ఇంకెవరైనా వస్తారా అనేది తేలాల్సి ఉంది. తమిళ్ లో రెండు సీజన్లు కమల్ హాసనే మేనేజ్ చేసాడు. హిందీ చూసుకుంటే 11 సీజన్ల  దాకా సల్మాన్ ఖాన్ తప్ప వేరే ఎవరిని తీసుకోవడం లేదు.సో నానికి ఇంకా ఛాన్స్ ఉన్నట్టే అనుకోవచ్చు. కాకపోతే నాని ఎంతవరకు ఒప్పుకుంటాడు అనేదే ప్రశ్నార్థకం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నప్పుడు షో మొత్తం ముంబై లో షూట్ చేసారు. వ్యయం కూడా బాగా అయ్యింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కావడంతో నాని చాలా కంఫర్టబుల్ గా తన షూటింగ్స్ ని బాలన్స్ చేసుకుంటూ వీక్ ఎండ్ ఎపిసోడ్స్ కోసం వస్తున్నాడు. మొదట్లో ఏమో కానీ నాని గురించి ఈ మధ్య మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ట్రాలింగ్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ అంచనాల మేరకు నాని షో నడుపుతున్నాడనే టాక్ అయితే ఉంది. మరి ఇప్పుడు  సీజన్ 3 అంటూ చేయబోయే కొత్త సిరీస్ కి పార్టిసిపెంట్స్ ని వెతకడం పెద్ద ఛాలెంజే. వంద రోజుల పాటు హౌస్ అరెస్ట్ అయ్యే సెలెబ్రిటీలను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అందుకే దానికి సంబందించిన చర్చలు ఏర్పాట్లు ఇప్పటినుంచే మొదలయ్యాయట. కొందరితో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఎక్కువ గ్యాప్ రాకుండా షోని నడిపే విధంగా అన్నపూర్ణలో బిగ్ బాస్ పెద్ద మకాం వేయబోతున్నాడన్న మాట.