'బిగ్ బాస్' భామ కొత్త స్టైల్

Fri Aug 11 2017 15:31:12 GMT+0530 (IST)

ప్రపంచం అందరిని ఆకర్షించిన బిగ్ బాస్ షో హిందీలో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సౌత్ జనాలు కూడా ఇప్పుడిపుడే ఈ కొత్త తరహా రియాలిటీ షోకి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఇప్పటికే మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ ఈ షో ని నడిపించడం పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి . తమిళ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తోన్న బిగ్ బాస్ షో మొదట్లో కాస్త ఆదరణ దక్కకపోయిన వాటిపై వచ్చిన విమర్శలు షో కి రేటింగ్స్ తెచ్చిపెట్టాయి.

అయితే తమిళ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓవియా హాలెన్ గత కొన్ని రోజుల క్రితం షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఎమోషన్స్ తట్టుకోలేక బాధతో తనకు తానే బయటకు వచ్చిన ఈ నటి ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బిగ్ బాస్ తర్వాత ఫాలోవర్స్ చాలా ఎక్కువయ్యారట. అంతే కాకుండా ఓవియ పోస్ట్ పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు దీనంగా కొంచెం వికృతంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కడిగిన ముత్యంలా తెగ మెరిసిపోతోంది.

ఒక కొత్త తరహాలో హెయిర్ స్టైల్ ని మార్చి అందరిని తనవైపు చూపు తిప్పుకోకుండా చేస్తోంది ఓవియ. అయితే ప్రస్తుతం ఓవియ "సిలుక్కువరిపట్టి" అనే తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీగా వుంది. రెజీనా - విష్ణు విశాల్ ప్రదాన పాత్ర దారులుగా చేస్తున్న ఈ చిత్రంలో ఓవియ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.