Begin typing your search above and press return to search.

హౌస్‌ లో ఆలీ బోల్డ్ పెర్పామెన్స్‌..ఫీల్ మూడ్‌ లో రాహుల్‌

By:  Tupaki Desk   |   22 Aug 2019 5:34 AM GMT
హౌస్‌ లో ఆలీ బోల్డ్ పెర్పామెన్స్‌..ఫీల్ మూడ్‌ లో రాహుల్‌
X
ఎంతో హాట్ హాట్ గా సాగుతోన్న బిగ్ బాస్ షో బుధవారం మరింత హాట్ గా సాగింది. కేవలం లేడీస్ మాత్రమే కాదు నేను హాట్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలని డ్యాన్స్ తో అదరగొట్టాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా హౌస్ మేట్స్ తమ టాలెంట్ తో ఆకట్టుకునే పని చేశారు. బాబా భాస్కర్ - శ్రీముఖిలు జడ్జిలు గా ఉండి హౌస్ మేట్స్ ప్రదర్శనలని జడ్జ్ చేసి కామెంట్లు ఇచ్చారు. అయితే చివరికి జడ్జిలు ఎవరికైతే యాప్పీ ఫీజ్ డ్రింక్ ఇస్తారో వాళ్ళు ఫైనల్లో తలపడతారని బిగ్ బాస్ చెప్పాడు.

దీంతో రాహుల్ ఫీల్ అవుతూ ఓ మంచి సాంగ్ పాడాడు. అయితే మొదటిసారి పాట పాడేటప్పుడు లిరిక్స్ మరిచిపోయానని ఒకసారి ఆపేయగా - మరొకసారి పాట పాడుతూ ఏదో ఫీల్ అవుతూ సాంగ్ పాడలేనని వెళ్లిపోయాడు. దీంతో జడ్జిగా ఉన్న శ్రీముఖి ప్రొఫెషనల్ సింగర్ అయి ఉండి ఇలా చేయకూడద‌ని పరువు పోతుందని క్లాస్ పీకడంతో మళ్ళీ ప్రిపేర్ అయ్యి పాడతానని చెప్పాడు. ఇక రాహుల్ కూర్చోవడంతో మహేశ్ వచ్చి బిగ్ బాస్ లో తన జర్నీ ఎలా సాగిందో ఒక స్కిట్ రూపంలో చేశాడు.

చివరికి బిగ్ బాస్‌కి రూపం లేదని - మనలో అంతరాత్మనే బిగ్ బాస్ అని మంచి మెసేజ్ ఇచ్చాడు. దీని తర్వాత సాంగ్ మంచిగా ప్రిపేర్ అయ్యి రాహుల్ ఫీల్ అవుతూ సాంగ్ ని అద్భుతంగా పాడాడు. జడ్జిలు కూడా ఫిదా అయ్యి డ్రింక్ బాటిల్ ఇచ్చారు. బాబా భాస్కర్ లవర్ ఉందా అంతా బాగా ఫీల్ అయ్యావ్ అన్నాడు. అప్పటిలో ఉండేదని రాహుల్ చెప్పాడు. రాహుల్ తర్వాత ర‌వి బ్లాక్ బాస్ట్ బ్లాక్ బాస్ట‌రే సాంగ్‌ కి ఒకవైపు అమ్మాయి ఒకవైపు అబ్బాయి గెట‌ప్‌ తో వ‌చ్చ త‌న‌దైన స్టెప్స్ వేసి జడ్జిల మెప్పుపొందాడు.

ఇక అలీ లేడీస్ కి ధీటుగా స్వింగ్ జర సాంగ్ కి హాట్ డ్యాన్స్ చేశాడు. షర్ట్ తీసేసి తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ అదరగొట్టాడు. దీనికి శ్రీముఖి బాగా ఎట్రాక్ట్ అయ్యి ఇది బోల్డ్ పెర్పామెన్స్ అంటూ కితాబిస్తూనే నాలుగు డ్రింక్ బాటిల్స్ ఇచ్చేసింది. చివరికి వరుణ్ సందేశ్ జమైకన్ గెటప్ లో వచ్చి ఉండి పోరాదే సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. వరుణ్ కు కూడా జడ్జిలు డ్రింక్ ఇచ్చారు. మొత్తం మీద అషు - రాహుల్ - అలీ - వరుణ్ లు బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చి ఈరోజు జరిగే ఎపిసోడ్లో ఫైనల్లో తలపడటానికి సిద్ధమయ్యారు.