Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 3.. అదిరిపోయే కాంబినేష‌న్..

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:29 AM GMT
బిగ్ బాస్ 3.. అదిరిపోయే కాంబినేష‌న్..
X
ఎండాకాలం వెళ్లిపోయింది. ఐపీఎల్ సీజ‌న్ ముగిసింది. వ‌ర్ష‌పు చిరుజ‌ల్లులు ఇప్పుడిప్పుడే భూమిని తాకుతున్న వేళ‌.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారింది. ఇలాంటివేళ‌.. మ‌ళ్లీ వేడి పుట్టించేందుకు బిగ్ బాస్ సీజ‌న్ 3 ప్రారంభం కానుంది. తెలుగులో మ‌రికొన్ని వారాల్లో స్టార్ట్ కానున్న ఈ రియాలీ షో.. త‌మిళ‌నాడులో రేప‌టి నుంచి సంద‌డి మొద‌లు కానుంది. తెలుగుతో పోలిస్తే త‌మిళ బిగ్ బాస్ కు ఆద‌ర‌ణ ఎక్కువ‌ని చెప్పాలి.

ప్ర‌ముఖ న‌టుడు.. రాజ‌కీయ పార్టీ అధినేత క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించే త‌మిళ బిగ్ బాస్ ఎంత‌లా పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలుగు బిగ్ బాస్ కు.. త‌మిళ బిగ్ బాస్ కు తేడా ఏమంటే.. త‌మిళ బిగ్ బాస్ హౌస్ లో ఆక‌ట్టుకునేలా వ్య‌వ‌హ‌రించినా.. వివాదాల‌తో జ‌నాల నోళ్ల‌ల్లో నానినా వారికి సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న ప‌రిస్థితి.

దీంతో.. బిగ్ బాస్ లో క‌నిపించేందుకు విప‌రీత‌మైన ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. సినిమాల్లో అవ‌కాశాలు చేజిక్కించుకోవాల‌నుకునే వారే కాదు.. ఈ షోతో మ‌ళ్లీ జ‌నం క‌ళ్ల‌ల్లో ప‌డాల‌ని సీనియ‌ర్లు సైతం ప్లాన్ చేసుకోవటంతో త‌మిళ బిగ్ బాస్ కు స్టార్ల కొర‌త లేకుండా పోయింది. రేప‌టి నుంచి షురూ కానున్న బిగ్ బాస్ 3లో ఎవ‌రు పార్టిసిపేట్ చేయ‌నున్నార‌న్న విష‌యానికి సంబంధించి అన‌ధికారికంగా ఒక లిస్ట్ వైర‌ల్ అవుతోంది.

ప‌దిహేను మంది స‌భ్యులు ఉండే బిగ్ బాస్ 3లో చోటు ద‌క్కించుకున్న‌ట్లుగా చెబుతున్న వారెవ‌రంటే.. సినిమా.. రాజ‌కీయాలు అన్న తేడా లేకుండా త‌ర‌చూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే న‌టి క‌స్తూరి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి.. న‌టుడు క‌మ్ సంగీత ద‌ర్శ‌కుడు ప్రేమ్ జీ.. న‌టి విచిత్ర‌.. ఒక‌ప్పుడు త‌ళుక్కున మెరిసిన అందం పూనం బ‌జ్వా.. చాందిని.. హాస్య న‌టి మ‌ధుమిత‌.. న‌టుడు మోహ‌న్ వైద్య‌.. శ‌క్తి చ‌ర‌ణ్.. సంతాన‌భార‌తి.. శ్రీ‌మాన్.. ర‌మేశ్ తిల‌క్.. టప్ మాష్ మృణాలిని.. మోడ‌ల్ శ్రీ‌గోపిక‌.. విజ‌య్ టీవీ ర‌మ్య‌.. సింగ‌ర్ క్రిష్ త‌దిత‌రులు బిగ్ బాస్ 3లో ఉంటార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఒక‌వేళ‌.. ఈ లిస్ట్ నిజ‌మైతే ప్రేక్ష‌కుల‌కు వినోదానికి ఢోకా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.