డైరెక్టర్ కి వార్నింగిచ్చిన బిగ్ బాస్ భామ

Wed Jun 13 2018 18:51:25 GMT+0530 (IST)

సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్లు తమను తాము సమర్పించుకునేందుకు ముందస్తుగా మాట రూపంలో చేసుకునే ఒప్పందమే ఈ కమిట్మెంట్. ఈ టాపిక్ ఇప్పటికే హాట్ హాట్ గా నడుస్తుండగా.. బిగ్ బాస్2 భామ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్2లో సంజన అనే విజయవాడ భామ కూడా ఎంట్రీ ఇచ్చింది. గత రెండేళ్లుగా మోడలింగ్ లో ఉన్న ఈమెకు.. కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ డైరెక్టర్ నుంచి అవకాశం వచ్చిందట. హీరోయిన్ ఆఫర్ ఇస్తానని చెప్పడంతో పాటు.. ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా తీసుకుంటానని చెప్పాడట. డేట్స్ చెబుతానని.. ఆ సమయంలో తనకు అందుబాటులో ఉండాలని అన్నాడట. అప్పుడు ఈమెకు అతడు చెబుతున్న మాటలలో అంతరార్ధం అర్ధం కాకపోవడంతో.. మీకెందుకు అందుబాటులో ఉండాలని అడిగిందట. చిన్నపిల్లవేమీ కాదు కదా.. తెలుసుకోమని చెప్పాడట ఆ దర్శకుడు.

తన స్నేహితులను విచారించిన తర్వాత.. అందుబాటులో ఉండడం అంటే సెక్సువల్ కమిట్మెంట్ అని వారు వివరించారట. దీంతో కోపం వచ్చిన సంజన.. చెప్పుతో కొడతానని మెసేజ్ పెట్టిందట. కొన్ని రోజుల తర్వాత అదే దర్శకుడు మళ్లీ కబురు పంపగా.. ఈసారి అన్న.. అక్కలతో కలిసి వెళ్లిందట సంజన. దీనికి ఆ దర్శకుడి మేనేజర్ కోపగించుకోవడంతో పాటు.. ఇండస్ట్రీలో ఇలా ఉండాలంటూ గుట్టు విప్పాడట. దీంతో కోపం తమాయించుకోలేకపోయిన సంజన.. నేరుగా వెళ్లి ఆ దర్శకుడి చెంప పగలకొట్టానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చెప్పలేదు కానీ.. అప్పటికి ఆ దర్శకుడు ఒక్క ఫ్లాప్ సినిమాను మాత్రమే తీశాడని తెలిపింది.