Begin typing your search above and press return to search.

ఆ తిమింగ‌ళం మ‌న స్టార్ల‌తోనూ!?

By:  Tupaki Desk   |   17 Oct 2018 3:30 PM GMT
ఆ తిమింగ‌ళం మ‌న స్టార్ల‌తోనూ!?
X
మీటూ హ్యాష్‌ట్యాగ్ కొంప‌లంటించేస్తోంది! ఎవ‌రెవ‌రి పేర్ల‌నో బ‌య‌ట‌కు తెస్తోంది. ఈ నెట్‌కి చిక్క‌ని చేప లేదు. పెద్ద పెద్ద పేర్లే బ్రేకింగులు అయ్యాయి. చానెళ్ల పాలిట టీఆర్‌పీలకు బ‌ల‌య్యేవాళ్లెంద‌రో. మీటూ ఉమెన్ కి మాత్ర‌మేనా.. మెన్‌కి కూడా అవ‌స‌రం.. మ‌హిళా వేధింపుల‌కు బ్రేక్ వేయాల్సిన త‌రుణ మిదేనంటూ `మీటూ - మెన్` ఉద్య‌మం మొద‌లైంది. అయితే ఇదంతా స‌రే.. ఈ ఉద్య‌మంలో టాలీవుడ్ నుంచి ఏవైనా పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయా? అంటూ ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

టాలీవుడ్ పేర్లేవీ ఇంత‌వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు కానీ, బాలీవుడ్ నుంచి మాత్రం పెద్ద పెద్ద చేప‌ల‌న్నీ చిక్కుతున్నాయి. వీళ్ల‌లో ముఖ్యంగా ఓ ఈవెంట్ మేనేజ‌ర్ `మీటూ`కి చిక్క‌డంతో అత‌డిపై సీరియ‌స్ పోలీస్ ఇంట‌రాగేష‌న్ సాగ‌నుంద‌న్న చ‌ర్చా మొద‌లైంది. ఆయ‌న బాలీవుడ్ లో బ‌డా స్టార్లంద‌రికీ త‌ల‌లో నాలుక‌లాంటోడు. వంద‌ల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో భారీ ఈవెంట్లు నిర్వ‌హిస్తూ, ట్యాలెంట్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాల్లో త‌ల‌పండిన కోవిదుడు. కోట్లాట‌లో నోట్లు వేటాడిన బిగ్ హ్యాండ్ అనిర్‌భాన్ బ్లా పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇంకా ఎన్నో పేర్లు బ‌య‌ట‌కొస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

శ్ర‌ద్ధా క‌పూర్ - సోన‌మ్ క‌పూర్ స‌హా ఎంద‌రో అత‌గాడి క్లైంట్స్. అంతేకాదు.. అత‌గాడి క్లైంట్ల జాబితాలో మ‌న టాలీవుడ్ స్టార్ల పేర్లు ఉన్నాయి. మ‌న హీరోల్లో మ‌హేష్ - రానాల‌కు బ్రాండ్ల విష‌యంలో సాయం చేసేది ఆయ‌నేన‌ట‌. అనిర్‌ భాన్ బ్లా క్లైంట్స్ వీళ్లిద్ద‌రూ.. సినిమాల కంటే బ్రాండ్ల‌తోనే ఎక్కువ సంపాదించ‌డానికి కార‌కుడు ఆయ‌న అని చెబుతారు. అంతేకాదు.. ఒక్కో బ్రాండ్ డీల్ సెట్ చేసినందుకు భారీగా ప‌ర్సంటేజ్ గుంజుకుంటాడు వీళ్ల నుంచి. కార్పొరెట్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో కోట్ల‌లో డీల్స్... కాంట్రాక్ట్స్‌...సెట్ చేస్తాడుట‌. అందుకే అత‌డి పేరు స్కైలో ఉంది. ఈ విష‌యాన్ని ఓ ప్ర‌ముఖ జాతీయ దిన‌ప‌త్రిక ప్ర‌చురించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌ముఖ యాడ్ ఏజెన్సీలు - ఈవెంట్ మేనేజ్‌మెంట్ - ట్యాలెంట్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాల్ని అనిర్ బ్లా చూస్తుంటారు. అత‌డు మీటూ వ‌ల్ల లైంగిక వేధింపుల్లో దొరికిపోవ‌డంతో క్లైంట్ల ప‌రిస్థితేంటి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కంగ‌న‌ - సోన‌మ్ వంటి స్టార్లు దీనిపై ఇంకా స్పందించలేదు. ఎవ‌రెవ‌రు స్పందిస్తారో చూడాలి.