Begin typing your search above and press return to search.

బిచ్చగాడు తర్వాత పిల్ల రాక్షసి

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:30 PM GMT
బిచ్చగాడు తర్వాత పిల్ల రాక్షసి
X
బిచ్చగాడు మూవీతో.. డబ్బింగ్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాతలు ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఆగస్టులో రిలీజ్ అయిన మలయాళ మూవీ 'ఆన్ మరియా కలిప్పిలాను' చిత్రాన్ని తెలుగులోకి తెస్తున్న చదలవాడ బ్రదర్స్.. ఈ చిత్ర విజయంపై బోలెడంత నమ్మకంగా ఉన్నారు.

నాన్న సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన బేబీ సారా ప్రధాన పాత్రలో ఈ ఆన్ మరియా చిత్రం రూపొందింది. పిల్లల సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. సూపర్ హిట్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో ఓ కేమియో రోల్ చేయడం.. బాగా కలిసొచ్చింది. ఓ నేరస్తుడితో ఓ చిన్నారి రిలేషన్ అనే కాన్సెప్ట్ పై రూపొందిన ఆన్ మరియాకు మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగులో పిల్ల రాక్షసిగా వస్తున్న ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందని నిర్మాతలు బోలెడంత నమ్మకంగా ఉన్నారు.

మంచి కంటెంట్ ఉంటే.. భాషా బేధం లేకుండా విజయం సాధించచ్చనే విషయాన్ని బిచ్చగాడుతో ప్రూవ్ చేసిన ఈ నిర్మాతలు.. పిల్ల రాక్షసి విషయంలో కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ముఖ్యంగా బిచ్చగాడు మూవీకి ఆ టైటిల్ ఎంత ప్లస్ అయిందో.. ఈ చిత్రానికి పిల్ల రాక్షసి టైటిల్ అంతకంటే ఎక్కువగా సూట్ అవుతుందని..ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు చదలవాడ బ్రదర్స్.