Begin typing your search above and press return to search.

ధోనీ అక్క 'మిస్సమ్మ' చెప్పిన కబుర్లు

By:  Tupaki Desk   |   30 Sep 2016 4:53 AM GMT
ధోనీ అక్క మిస్సమ్మ చెప్పిన కబుర్లు
X
ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ మూవీ ఇవాళే థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు యూట్యూబ్ లో ఎన్ని సెన్సేషన్స్ సృష్టించిందో.. థియేటర్లలో కూడా వాటన్నిటినీ రిపీట్ చేసేట్లుగానే కనిపిస్తోంది. అయితే.. ఈ సినిమాలో ధోనీకి అక్కగా నటించి.. టాలీవుడ్ మిస్సమ్మ భూమికా చావ్లా ఓ షాక్ ఇచ్చింది. భూమికను ఇలా అక్క పాత్రలో చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోని ఫ్యాన్స్ అయితే షాక్ తినేశారు. కానీ ఈ పాత్ర చేయడం వెనక స్టోరీని చెప్పుకొచ్చింది భూమిక.

తను క్రికెట్ కి కానీ.. ధోనీకి కానీ ఫ్యాన్ ని కాదంటున్న భూమిక.. గేమ్ ని ఫాలో అవుతానని చెబుతోంది. 'చిన్న టౌన్ నుంచి వచ్చి.. దేశం మొత్తం ప్రేమించే వ్యక్తిగా ఎదగడంలో ధోనీ శ్రమ చాలా ఉంది. సిక్సులు కొట్టడంలోనే తనలో స్టఫ్ ఎంతుందో అర్ధమవుతుంది. తన అక్కగా జానకి పాత్రకు అడిగినప్పుడు.. పెద్దగా ఆలోచించకుండానే ఓకే చెప్పేశాను. ధోనీ కంటే 2-3 ఏళ్లు పెద్దదైన అక్క జానకి పాత్ర ఇది. ధోనీతో ఎంతో అనుబంధం ఉంటుంది. నేను తనని కలవకపోయినా.. తమ్ముడికి స్ఫూర్తిగా నిలిచి.. సపోర్ట్ ఇచ్చి.. వెన్నంటే ఉంటుంది' అని చెప్పింది భూమిక.

బాగా గ్యాప్ తీసుకున్న రీఎంట్రీ కోసం మరి ఇలాంటి పాత్రే ఎందుకు భూమికా అంటే 'నేను నాలుగున్నర నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు తెలుగులో ఏప్రిల్ ఫూల్ సినిమా చేశా. నా కొడుకు యష్ కు ఏడు నెలల వయసున్నపుడు కన్నడలో నటించా.. నేను నటించడం ఆపలేదు. అలాగని అమ్మ..అక్క పాత్రలతో సరిపెట్టేస్తానని అనుకోవద్దు. నా నెక్ట్స్ మూవీతో షాక్ ఇవ్వడంపైనే దృష్టి పెడతా' అంటోంది భూమిక. మరి ఈ మాటలు వింటే.. అక్క రోల్స్ చేస్తానన్నట్లా? చేయనని చెప్పినట్లా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/