Begin typing your search above and press return to search.

ఫిదా బ్యూటీని డామినేట్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   15 Dec 2017 6:00 AM GMT
ఫిదా బ్యూటీని డామినేట్ చేస్తుందా?
X
వరుసగా హిట్స్ తో కెరీర్ ను కొనసాగిస్తున్న నాని ఈ ఏడాది కూడా హిట్ తో 2017కి గుడ్ బాయ్ చెప్పాలని ట్రై చేస్తున్నాడు. అయితే నాని ప్రతి సినిమాలో హీరోయిన్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎక్కువగా అతను తీసింది ప్రేమ కథలే కాబట్టి నానితో ఏ హీరోయిన్ జతకట్టినా కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుంది. ఇక ఎంసీఏ లో కూడా ఆ తరహాలోనే ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందులోను ఫిదా బ్యూటీ సాయి పల్లవి నాని సరసన నటిస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుందని ఆలోచనతో ఉన్నారు.

అయితే సినిమాలో సాయి పల్లవిని మాత్రం భూమిక డామినేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎంసీఏ కథ వదినా మరిది మధ్య ఉంటుందని ట్రైలర్ లోనే కనిపించింది. కాన్సెప్ట్ కొత్తదే అయినా కూడా ప్రేక్షకులు కొంత వరకు ముందే ఊహించేస్తున్నారు. అయితే సినిమాలో భూమిక పాత్ర చాలా ముఖ్యమట. కథలో ఎక్కువగా ఆమె పాత్ర చుట్టు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని తెలుస్తోంది. అయితే భూమిక కూడా పాత్రకు తగ్గ న్యాయం చేసిందట. ఆమె పాత్ర సినిమా స్థాయిని పెంచుతుందని అంటున్నారు. అయితే భూమిక వల్ల సాయి పల్లవి రేంజ్ తగ్గుతుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొన్నటి వరకు సాయి పల్లవి అండ్ నాని జోడి సినిమాలో హైలెట్ అనే టాక్ వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత భూమిక ఫిదా బ్యూటీని డామినేట్ చేస్తుందేమో అనే సందేహాలు వెలువడుతున్నాయి. మరి ఎంతవరకు ఈ ఊహాగానాలు నిజమవుతాయో రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అయితే సినిమాలో సాయి పల్లవి మాత్రం చాలా కొత్తగా అందంగా కనిపిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఇక సినిమా ఫైనల్ గా అని పనులను పూర్తి చేసుకుంది. ఈ నెల 21న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.