షర్మిల పాత్రలో సీనియర్ హీరోయిన్

Mon May 21 2018 17:02:39 GMT+0530 (IST)

మొన్నటి వరకు సినిమాలు డిఫెరెంట్ జానర్స్ లో వచ్చినట్లు ఇప్పుడు బయోపిక్ ఫార్మాట్ లో వస్తుండడం చెప్పుకోదగ్గ విషయం. సావిత్రి సినిమా ఎప్పుడైతే మంచి సక్సెస్ అయ్యిందో దైర్యంగా నిజ జీవిత కథలను చూపించవచ్చని సినిమా వాళ్లు ఆరాటపడుతున్నారు. బాలకృష్ణ అదే తరహాలో ఇటీవల ఎన్టీఆర్ సినిమా పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా తెరకెక్కుతోంది.దర్శకుడైన మహి వి రాఘవ్ తన క్యాస్టింగ్ విషయంలో ఎవరు ఊహించని విధంగా నటీనటులను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. 2003 లో వైఎస్ హిట్ ఫార్మాట్ యాత్రను బేస్ చేసుకొని బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యాత్ర అనే ఈ సినిమాలో ఇప్పటికే వైఎస్ పాత్రకు మమ్ముట్టి సెలెక్ట్ అయ్యారు. పంచె కట్టు హావభావాలకు సంబందించిన పోస్టర్స్ జనాలను బాగా ఆకర్షించాయి. అయితే ఈ సినిమాలో పోసాని కూడా ఉన్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. బాహుబలి యాక్టర్ ఆశ్రిత విజయమ్మ పాత్రలో కనిపించనున్నారు.

అయితే వైఎస్ యాత్రలో కీలకపాత్ర పోషించింది ఆయన కొడుకు జగన్ - కూతురు షర్మిల. ఎన్నికల్లో తండ్రికి తగ్గ పిల్లలుగా రాణించారు. అయితే షర్మిల పాత్ర కోసం భూమికను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంసీఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఖుషి బ్యూటీ ఈ సినిమాలో తన విలక్షణ నటనతో మళ్లీ అలరించనుంది. ఆల్రెడీ ధోని బయోపిక్ లో అక్కగా కనిపించిన తరువాత భూమికకు ఇది రెండవ బయోపిక్ కావడం విశేషం.