నాజూకుతనం నయా అడ్రెస్

Tue May 15 2018 12:43:45 GMT+0530 (IST)

హీరొయిన్లు సాధారణంగా సన్నగా ఉండి కెరీర్లో ముందు వెళ్ళే కొద్ది లావు కావడం సహజం. అందరి విషయంలో కాకపోయినా కొంతమందిలో ఇది గమనిస్తూ ఉంటాం. కాని పరిచయం కావడమే స్థూలకాయంతో వచ్చి కేవలం మూడేళ్ళలో నమ్మశక్యం కాని రీతిలో బరువు తగ్గించుకుని స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన హీరొయిన్ భూమి పెడ్నేకర్. 2015లో వచ్చిన దం లాగాకే హైసాలో అధిక బరువుతో బాధ పడే అమ్మాయి పాత్రలో విమర్శకులను సైతం మెప్పించిన భూమికి తన శరీరం కారణంగానే తర్వాత అవకాశాలు రాలేదు. నటన పరంగా ఏ లోటూ లేనప్పటికీ తనలో తగ్గాల్సింది బరువు అని గుర్తించిన భూమి అతి తక్కువ టైం ఒంట్లో సగం పైగా కొవ్వుని కరిగించేసింది. ఆ హార్డ్ వర్క్ ఏకంగా అక్షయ్ కుమార్ టాయిలెట్ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది.ఆ మూవీలో భూమిని చూసి తన మొదటి సినిమాలో తనేనా అని అందరు ఆశ్చర్యపోయారు. అయినా పట్టువదలకుండా ఇంకా వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంది. పైన ఫోటో తనదే. చెమట చిందిస్తూ టాప్ యాంగిల్ లో నుంచి తీసుకున్న సెల్ఫీతో తనను గ్లామర్ పాత్రలకు కూడా తీసుకోవచ్చు అనే సూచన ఇచ్చినట్టే ఉంది. టాయిలెట్ తర్వాత శుభ మంగళ సావధాన్ సినిమాలో కూడా హోమ్లీ పాత్ర చేసిన భూమి ప్రస్తుతం రెండు సినిమాలు ఓకే చేసింది. బాంబే టాకీస్ 2 తో పాటు సొన్చిచిరియా అనే మరో ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న భూమి స్టార్ హీరోలతో ఇంకా పెద్ద బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. తన మొదటి సినిమా వదిలేసి తనను పరిగణించమని చెబుతున్న భూమి పెడ్నేకర్ లావుగా ఉన్నామని బాధ పడే అమ్మాయిలు రోల్ మోడల్ గా తీసుకోవచ్చు. ఆ మధ్య బొద్దు గుమ్మ నమిత కూడా ఇలాగే సన్నబడే ప్రయత్నం చేసింది కాని పూర్తిగా సక్సెస్ కాలేదు. పర్వాలేదు అనిపించే స్థాయిలో పెళ్లి నాటికి సన్నబడింది. కాని తను కెరీర్ చాలా చూసేసింది. భూమి సినిమాల వయసు ఇంకా రెండే.