ముగ్గురు హీరోలతో భవ్యమైన సినిమాలు

Sat Aug 11 2018 07:00:26 GMT+0530 (IST)

ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమా తీసి విడుదల చేయడానికి తలప్రాణం తోకలోకి వస్తోంది. అలాంటిది వరుసగా మూడు ప్రాజెక్ట్స్ ని లైన్ లో ఉంచడం చిన్న విషయం కాదు. గోపీచంద్ తో తీసే సినిమాలతో ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన భవ్య క్రియేషన్స్ తాజాగా ముగ్గురు యూత్ హీరోలతో విడివిడిగా సినిమాలు తీసేందుకు ప్లానింగ్ లో ఉంది. ఇందులో ఒకటి నాగ శౌర్యతో ఉండబోతోంది. ఛలో సక్సెస్ తో తనకంటూ మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శౌర్య ఈ నెలాఖరుకు @నర్తనశాలతో రాబోతున్నాడు. వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. రీజనబుల్ బడ్జెట్ లో  శౌర్యతో మంచి కంటెంట్ తో కనక చేస్తే  లాభాలతో మార్కెట్ చేసుకోవచ్చు. ఇక న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది భవ్య సంస్థ. ప్రస్తుతం దేవదాస్ తో బిజీగా ఉన్న నాని నుంచి  మరో ప్రాజెక్ట్ కమిట్ అయినట్టు అధికారిక ప్రకటన లేదు కాబట్టి ఇదే ఉండే అవకాశం ఉంది.ఇక నితిన్ తో మరో మూవీకి ప్లాన్ చేస్తోంది భవ్య క్రియేషన్స్. ఈ మధ్య చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా నితిన్ మార్కెట్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమి లేదు. ఇటీవలే శ్రీనివాస కళ్యాణంతో పలకరించిన నితిన్ దీని తర్వాత ఏది చేస్తాడు అనే స్పష్టత ఇంకా రాలేదు. అది ఇదే అయ్యే అవకాశం ఉంది. ఇలా ముగ్గురు హీరోలతో వరసగా ప్లాన్ చేయటం అంటే చిన్న విషయం కాదుగా. గత ఏడాది పైసా వసూల్-శమంతకమణిలతో రెండు ఫలితాలు చవిచూసిన భవ్య సంస్థ అధినేత ఆనంద ప్రసాద్ ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో గోపీచంద్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తారు అనే టాక్ వచ్చింది కానీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనేది ఫ్రెష్ అప్ డేట్. అయినా ఎలాగూ ఆ మూడు సినిమాలకు టైం పడుతుంది కాబట్టి ఆ లోపు గోపీచంద్ కోసం కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు.