సినిమాల్లోనే కాదు ఎన్నికల్లోనూ ఫ్లాప్

Tue Dec 11 2018 18:33:52 GMT+0530 (IST)

ప్రముఖ రియల్టర్ - వ్యాపారవేత్త అయిన భవ్య ఆనంద్ ప్రసాద్ గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున శేరిలింగం పల్లి సీటు నుండి పోటీ చేసిన విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీకి కంచు కోట వంటి నియోజక వర్గం అయినందున భవ్య ఆనంద్ ప్రసాద్ ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకంను తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు సినీ వర్గాల వారు వ్యక్తం చేశారు. కాని భవ్య ఆనంద్ ప్రసాద్ టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడి పోవడం జరిగింది.ఈమద్య కాలంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమాల్లో పెద్దగా ఆడిన సినిమాలు ఏమీ లేవు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతూ నష్టాలను మిగుల్చుతున్న సమయంలోనే ఎన్నికల్లో కూడా ఓడి పోవడం ఆయనకు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో భవ్య ఆనంద్ ప్రసాద్ భారీగా డబ్బు ఖర్చు చేశాడంటూ ప్రచారం జరిగింది.

వ్యాపారంలో మంచి లాభాలను దక్కించుకుంటున్న ఆనంద్ ప్రసాద్ సీటు దక్కించుకున్నప్పటి నుండి ఓటింగ్ రోజు వరకు కూడా రోజుకు లక్షల్లో - కోట్లల్లో కూడా ఖర్చు చేశాడంటూ కొందరు అనుకుంటున్నారు. అంతగా ఖర్చు చేసినా కూడా భవ్య ఆనంద్ ప్రసాద్ సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆయన సినిమాలు భారీ ఖర్చుతో తీసినా కూడా ఫ్లాప్ అయినట్లుగానే ఆయన భారీగా ఖర్చు చేసినా కూడా ఎమ్మెల్యేగా గెలువలేక పోయాడు.