Begin typing your search above and press return to search.

ఆమెపై రేప్ జ‌ర‌గ‌లేదంటున్న ద‌ర్శ‌కుడు

By:  Tupaki Desk   |   22 Feb 2017 1:10 PM GMT
ఆమెపై రేప్ జ‌ర‌గ‌లేదంటున్న ద‌ర్శ‌కుడు
X
ప్ర‌ముఖ మ‌ళ‌యాళ న‌టి భావ‌న కిడ్నాప్ ఎపిసోడ్‌ లో కొత్త అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఆమెపై రేప్ జ‌రిగిందంటూ వార్త‌లు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా చెడు ప్ర‌చార‌మ‌ని అన్నారు. తాను సినీ న‌టితో మాట్లాడాన‌ని, రేప్ జ‌ర‌గ‌లేద‌ని ఆమె త‌న‌కు వెల్ల‌డించింద‌ని చెప్పారు. తెలిసీ తెలియ‌ని విష‌యాల‌ను మీడియా ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని కోరారు.

ఆ నటి చాలా ధైర్యవంతురాలని, ఆమెతో తాను పని చేసానని చెప్పిన ప్రియ‌ద‌ర్శ‌న్ ఈ ప‌రిచ‌యంతో ఆమెను క‌లిసి ప‌రిస్థితి గురించి వాక‌బు చేసిన‌ట్లు చెప్పారు. త‌న‌తో మాట్లాడిన సంద‌ర్భంగా రేప్ జ‌ర‌గ‌లేద‌ని చెప్పిన‌ట్లు వివ‌రించారు. కిడ్నాప్ చేసిన అనంత‌రం వివ‌స్త్రను చేసి ఫొటోలు తీశార‌ని, లైంగిక వేధింపుల‌కు మాత్ర‌మే పాల్ప‌డ్డార‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. తెలిసిన వాళ్లే ఇలా చేయ‌డం బాద‌ క‌లిగిస్తోందని ప్రియ‌ద‌ర్శ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఉదంతం వెనుక మలయాళ సినీ పెద్దల హస్తం వుందనే పుకార్లపై మీ స్పంద‌న ఏమిట‌ని ప్ర‌శ్నించ‌గా...ప్రియదర్శన్ స‌మాధానం దాటవేశారు. ఈ పాపం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమె త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకి రావాలని కోరుకుంటున్నానని ముక్తాయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/