Begin typing your search above and press return to search.

హీరోయిన్ కిడ్నాప్ ఉదంతంలో షాకింగ్ ఉదంతాలు...

By:  Tupaki Desk   |   22 Feb 2017 1:07 PM GMT
హీరోయిన్ కిడ్నాప్ ఉదంతంలో షాకింగ్ ఉదంతాలు...
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ నటి కిడ్నాప్ - లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గుతోంది. పోలీసుల ఎఫ్‌ ఐఆర్‌ లో పేర్కొన్న వివ‌రాల‌ను ఓ మీడియా ప్ర‌చురించ‌గా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఆ వివ‌రాల ప్ర‌కారం....హీరోయిన్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా షూటింగ్‌ ను త్రిశూర్‌ కు సమీపంలో ముగించుకొని సాయంత్రం స‌మ‌యంలో చిత్ర‌నిర్మాణ సంస్థ స‌మ‌కూర్చిన వాహ‌నంలో బ‌య‌లుదేరింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌ లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమెను తీసుకువెళుతున్న డ్రైవ‌ర్ మార్టిన్ అప్ప‌టికే కుదిరిన డీల్ మేర‌కు పల్సర్‌ సుని గ్యాంగ్ కు స‌మాచారం ఇచ్చాడు.

దీంతో ప‌ల్స‌ర్ సునీ గ్యాంగ్ క్యాటరింగ్‌ వ్యాన్‌ లో సినీ న‌టిని వెంటాడి రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌ పోర్ట్‌ జంక్షన్‌ లో ఢీకొట్టింది. అనంత‌రం నిందితులు కారులోకి చొర‌బ‌డి గొంతు మూసివేసి ఆమె ఫోన్‌ ను లాక్కున్నారు. ఇందులో నుంచి ఓ దుండ‌గుడు దిగిపోగా మ‌రో వ్య‌క్తి కారు ఎక్కాడు. కొద్దిసేప‌టి త‌ర్వాత ప‌ల్స‌ర్ సునిల్ మాస్క్ క‌ట్టుకొని డ్రైవ‌ర్ సీటులోకి రాగా మిగ‌తా వారు క్యాట‌రింగ్ వ్యానులోకి వెళ్లారు. అనంత‌రం వాహ‌నాన్ని క‌క్క‌నాడ్ ప్రాంతానికి తీసుకువెళ్లిన ప‌ల్స‌ర్ సునీ లైంగికంగా వేధించాడు. వేరే వారి త‌ర‌ఫున తాను వ‌చ్చాన‌ని పేర్కొంటూ ఆమెను అస‌భ్యంగా చిత్రీక‌రించి ఆ తదుప‌రి కారులో నుంచి తోసేశాడు. ఇలా రెండున్న‌ర గంట‌ల పాటు ఈ దుశ్చ‌ర్య కొన‌సాగింద‌ని ఎఫ్ ఐఆర్‌ లో పోలీసులు పేర్కొన్నట్లు స‌ద‌రు మీడియా వివ‌రించిందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, తీవ్ర‌మైన ఆవేద‌న స్థితిలో ఆమె ద‌ర్శ‌కుడు లాల్ ఇంటికి వెళ్లి అనంత‌రం పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్లి త‌న‌కు జ‌రిగిన ఘోర‌మైన అనుభ‌వాన్ని పోలీసుల‌కు చెప్పింది. రూ.30ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బెదిరించాడ‌ని ఒక‌వేళ ఒప్పుకోకుంటే డ్ర‌గ్స్ ఇంజెక్ట్ చేస్తాన‌ని హెచ్చ‌రించిన‌ట్లు పోలీసుల‌తో వాపోయిందని ఎఫ్ ఐఆర్‌ లో పోలీసులు పేర్కొట‌న్లు స‌ద‌రు మీడియా క‌థ‌నం వెలువ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/