అఫీషియల్ : భరత్-సూర్య రాజీ పడ్డారు

Thu Feb 22 2018 17:55:44 GMT+0530 (IST)

ఏప్రిల్ 26నే వస్తామని ఒకరి మీద ఒకరు పోటీకి సై అన్న నా పేరు సూర్య భరత్ అనే నేను నిర్మాతలు ఇందాకా జరిగిన సామరస్యపూర్వక సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా ఈ డేట్స్ గురించి అభిమానుల్లో సైతం తీవ్ర ఆందోళన ఉంది. ఒకేరోజు క్లాష్ అవ్వడం వచ్చే ఇబ్బందుల గురించి వాళ్ళ మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు సైతం దీని గురించి వర్రీ అవుతుండటంతో ఇప్పుడు అధికారికంగా దీనికి చెక్ పడిపోయింది. సీనియర్ నిర్మాతలు డాక్టర్ కెఎల్ నారాయణ - దిల్ రాజు లతో పాటు నా పేరు సూర్య నిర్మాతలు బన్నీ వాసు - లగడపాటి శ్రీధర్ - సమర్పకుడు నాగబాబు తో కలిసి భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. సాధ్యాసాధ్యాల గురించి చాలా సేపు చర్చించిన అనంతరం పక్కా  కంక్లూజన్ కు వచ్చేసారు.దీని ప్రకారం నా పేరు సూర్య ఒక వారం ఆలస్యంగా అంటే మే 4న విడుదల అవుతుంది. ఇక భరత్ అనే నేను ప్రీ పోన్ చేస్తూ ఏప్రిల్  20న వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన రెండు సినిమాలకు రెండు వారాల మంచి గ్యాప్ దొరుకుతుంది. మధ్యలో వచ్చే రజనికాంత్ కాలా డేట్ లో మాత్రం ఏ మార్పు ఉండదు. ఇప్పుడు బన్నీ - ప్రిన్స్ ఫాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రమోషన్ పరంగా నా పేరు సూర్య అడ్వాన్సు గా ఉంది. ఈ పాటికే టీజర్ - రెండు ఆడియో ట్రాక్స్  విడుదల చేసేసారు. భరత్ అనే నేను ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక వాయిస్ ఓవర్ ఓత్ మాత్రం వచ్చింది. ఇప్పుడు డేట్ పక్కా అయ్యింది కాబట్టి భరత్ అనే నేను ప్రమోషన్ వేగం అందుకుంటుంది. ఈ మీటింగ్ జరగడానికి ముందే మహేష్ - బన్నీ సైతం ఒకరికొకరు ఫోన్ లో దీని గురించి చర్చించినట్టు తెలిసింది. వాళ్ళ చొరవ కూడా ఉండటం వల్లే ఈ మీటింగ్ కుదిరిందని టాక్.

ఇలా ఒక అండర్ స్టాండింగ్ తో కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఊరికే పంతాలకు పోయి ఓపెనింగ్స్ తగ్గించుకోవడం కంటే ఇలా ఆరోగ్యకరమైన గ్యాప్ మైంటైన్ చేయటం చాలా హెల్ప్ అవుతుంది. అది గుర్తించి ఇలా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రత్యేక చొరవ తీసుకున్న నారాయణ - దిల్ రాజులు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.