Begin typing your search above and press return to search.

వీడియో: ఝాన్సీరాణి ప‌య‌నం

By:  Tupaki Desk   |   16 Jan 2019 4:34 AM GMT
వీడియో: ఝాన్సీరాణి ప‌య‌నం
X
ఎన్నో ఒడిదుడుకులు.. దాంతో పాటే ఆన్ లొకేష‌న్ ఎన్నో గొడ‌వ‌లు.. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో అల‌క‌లు .. ప‌రాచికాలు.. వెట‌కారాలు.. అన్నీ అయిపోయాయి. అన్నిటినీ అధిగ‌మించి క్వీన్ కంగ‌న ర‌నౌత్ రియాలిటీలోనూ ప‌రాక్రమం చూపించేందుకు రెడీ అవుతోంది. కంగ‌న న‌టించిన `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆప్ ఝాన్సీ` చిత్రం ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. రిప‌బ్లిక్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా గురించి బాలీవుడ్ స‌హా అన్నిచోట్లా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. తాజాగా భ‌ర‌త్ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఝాన్సీ రాణి ప‌య‌నం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. బాల్యం నుంచి క‌త్తి ప‌ట్టి వీర‌నారిగా మారే ప‌రిణామ క్ర‌మాన్ని ఈ వీడియోలో రివీల్ చేశారు. గురుగ్రామ్ ఏరియాలో ప్ర‌చారం చేశారు క్వీన్.

శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ ఈ చిత్రానికి సంగీతం ప‌రంగా అన్నీ తానే అయ్యి ప‌ని చేశార‌ట‌. భ‌ర‌త్ పాట‌కు ప్ర‌సూన్ జోషి లిరిక్స్ అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా వెన‌కాడ‌ని ఓ ధీర‌వ‌నిత పై అద్భుత‌మైన పాట‌ను రాశారాయ‌న‌. ఈస్ట్ ఇండియా కంపెనీపై క‌త్తి దూసే వీరనారిగా ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ ప‌రాక్ర‌మం అస‌మానంగా చూపిస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది. అంకిత లోఖండే ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. క్రిష్ - కంగ‌న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.