Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్: దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆయనే

By:  Tupaki Desk   |   18 Aug 2018 11:31 AM GMT
ఎన్టీఆర్: దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఆయనే
X
ఒక సినిమా గురించి మహా అయితే ఎన్ని అప్డేట్ లు వస్తాయి? వారానికో లేక పది రోజులకో ఒకటి. కానీ 'ఎన్టీఆర్' చిత్రం మాత్రం అప్డేట్ ల విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించేలా ఉంది. ఇప్పటికే రోజూ ఒక అప్డేట్ లేకపోతె రెండు రోజుల గ్యాప్ లో ఒక అప్డేట్ అన్నట్టుగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. రకుల్ ప్రీత్ అన్నారు, రాశి ఖన్నా అన్నారు.. రానా దగ్గుబాటి అన్నారు.. ఇప్పుడు తాజాగా డా. భరత్ రెడ్డి జాయిన్ అయ్యాడు.

ఇంతకీ ఈ భరత్ ఏ పాత్రలో కనిపిస్తాడు? ఎన్టీఆర్ అల్లుడు, పురందరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు క్యారక్టర్ లో ఈ భరత్ రెడ్డి కనిపిస్తాడట. భరత్ చాలా సినిమాల్లో కీలకమైన పాత్రలో పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం విశేషమే. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపిస్తున్నాడని తెలిసిందే కదా. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్ర ఉంటుందా లేదా అని కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కానీ వాటన్నిటికీ భరత్ సెలెక్షన్ తో ఫుల్ స్టాప్ పెట్టింది 'ఎన్టీఆర్' టీమ్.

టైం ప్రకారం చకచకా షూటింగ్ పూర్తి చేయడంలో డైరెక్టర్ క్రిష్ కు చాలా మంచి పేరు ఉంది. దానికి తగ్గట్టే షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ను చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది జనవరి 9 న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.