బాలయ్య ఎనర్జీ చూస్తే సిగ్గేస్తుందట!

Wed Sep 19 2018 18:48:47 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ అంటే భారీ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోగానే కాకుండా అప్పుడప్పుడూ వివాదాలతో కూడా అయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది.  ఫ్యాన్స్ మీద చెయ్యి చేసుకున్నందుకు..  ఆడియో ఫంక్షన్ లో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఉన్నారు.  అవన్నీ ఉన్నా బాలయ్యను అభిమానించే వారికి కొదవేమీ లేదు.   యాక్టర్ భరత్ రెడ్డి రీసెంట్ గా బాలయ్యను విపరీతంగ అభిమానించే వాళ్ళ లిస్టు లో చేరాడు.'ఎన్టీఆర్' సినిమాలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి నటిస్తున్న విషయం తెలిసిందే.   భరత్ రెడ్డి జస్ట్ నటుడే కాదు ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు) అనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు.   అయన బాలయ్య మీద ప్రశంసల వర్షం కురిపించాడు.  "నేను చాలా తక్కువమందని ఎక్కువగా అభిమానిస్తాను. వాళ్ళందరూ స్వచ్చంగా ఉంటారని అనుకుంటాను.  వారిలో బాలకృష్ణ గారు నెంబర్ వన్. అయన జెన్యూన్ గా.. ముక్కుసూటిగా ఉంటారు.  అలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో అలాంటి వారు చాలా అరుదు" అన్నాడు.  

"బాలయ్యగారికి సినిమా ఇండస్ట్రీలో 45 ఏళ్ళ అనుభవం ఉన్నా.. ఎంతో సీనియర్ అయినా ఇప్పటికే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు.  సెట్స్ లో అయన ఎనర్జీతో నాలాంటి నటులను సిగ్గుపడేలా చేస్తారు."  బాలయ్య లాగా ఉండే మరో హీరో అజిత్ అని కూడా చెప్పాడు భరత్.  తను కూడా జెన్యూన్ గా ఉంటాడని పెద్ద స్టార్ అయినా ఎంతో ఒదిగి ఉంటాడని అన్నాడు.