Begin typing your search above and press return to search.

భారత్.. ఐదు దశలు.. ఐదు గెటప్పులు!

By:  Tupaki Desk   |   20 April 2019 1:31 PM GMT
భారత్.. ఐదు దశలు.. ఐదు గెటప్పులు!
X
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భారత్' జూన్ 5 న ఈద్ పర్వదినం సందర్భంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'భారత్' టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. గత కొన్ని రోజులుగా సల్మాన్ ఖాన్ డిఫరెంట్ గెటప్స్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసస్తూ వచ్చిన 'భారత్' టీమ్ తాజాగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమా కథ 1964 నుండి 2010 వరకు సాగుతుందని.. ఇందులో సల్మాన్ ఐదు విభిన్న గెటప్పులలో కనిపిస్తాడని ఈ మోషన్ పోస్టర్లో రివీల్ చేశారు. 1964 లో సర్కస్‌ లో పనిచేసే స్టంట్ మాస్టర్‌గా.. 1970 లో ఒక గనిలో పనిచేసే వ్యక్తిగా.. 1985 లో నేవీలో పనిచేసే ఆఫీసర్‌గా.. 1990 లో పైకి నవ్వుతో కనిపిస్తూనే లోపల ఏదో తెలియని బాధ ఉన్న వ్యక్తిలా.. 2010 లో వయసు మళ్ళిన వ్యక్తిగా ఐదు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. మోషన్ పోస్టర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇలా ఇదు గెటప్ లు.. దేశంతో పాటు సాగే ఒక వ్యక్తి అనే క్యాప్షన్ చూస్తే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

ఈ సినిమా కొరియన్ ఫిలిం 'ఓడ్ టూ మై ఫాదర్' ఆధారంగా తెరకెక్కుతోంది. కత్రినా కైఫ్.. దిశా పతాని.. సోనాలి కులకర్ణి.. టబు.. నోరా ఫతేహి.. సునీల్ గ్రోవర్ లో ఈ సినిమాలో ఇతర కీకలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ - శేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలీ అబ్బాస్ జఫార్ ఈ సినిమాకు దర్శకుడు.