Begin typing your search above and press return to search.

అల్ టైం రికార్డ్స్ లో భరత్ ప్లేస్

By:  Tupaki Desk   |   22 April 2018 4:20 AM GMT
అల్ టైం రికార్డ్స్ లో భరత్ ప్లేస్
X
భరత్ అనే నేను చడీచప్పుడు లేకుండా రికార్డుల పని పడుతోంది. ఇతర విషయాల మీద ఫోకస్ ఎక్కువగా ఉండటంతో మీడియాలో దీన్ని హై లైట్ చేయటం లేదు కాని మహేష్ బాబు మళ్ళి తన ట్రాక్ లోకి వచ్చాడు అన్నది వసూళ్ళ సాక్షిగా స్పష్టమవుతోంది. యావరేజ్ టాక్ సినిమాలకే సూపర్ ఓపెనింగ్స్ రాబట్టే మహేష్ భరత్ అనే నేనుకి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆగుతాడా. ఇప్పుడు అదే జరుగుతోంది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాల్లో టాప్ 5 లో ప్లేస్ కొట్టేసింది. ఇప్పటి దాకా సౌత్ నుంచి వచ్చిన అన్ని బాషా సినిమాల మొదటి రోజు గ్రాస్ ప్రకారం చూసుకుంటే లెక్కలు ఈ కింది విధంగా ఉన్నాయి

1. బాహుబలి 2 (అన్ని బాషలు) – 215 కోట్లు
2. కబాలి (తెలుగు - తమిళ్ - హింది) – 87 కోట్ల 50 లక్షలు
3. బాహుబలి – 73 కోట్లు
4. అజ్ఞాతవాసి – 60 కోట్ల 50 లక్షలు
5. భరత్ అనే నేను – 55 కోట్లు
6. ఖైది నెంబర్ 150 – 50 కోట్ల 50 లక్షలు
7. మెర్సల్ – 47 కోట్లు
8. జై లవకుశ – 46 కోట్ల 60 లక్షలు
9. రంగస్థలం – 43 కోట్ల 80 లక్షలు
10. స్పైడర్ – 41 కోట్ల 50 లక్షలు
11. జనతా గ్యారేజ్ – 41 కోట్లు
12. సర్దార్ గబ్బర్ సింగ్ – 40 కోట్ల 80 లక్షలు
13. కాటమరాయడు – 39 కోట్ల 20 లక్షలు
14. లింగా(తెలుగు, తమిళ్)- 38 కోట్ల 95 లక్షలు
15. శంకర్ ఐ – 36 కోట్లు
16. డిజే – 34 కోట్లు
17. శ్రీమంతుడు – 33 కోట్లు
18. రోబో(మూడు బాషలు)- 30 కోట్లు
19. వివేగం – 29 కోట్లు
20. తేరి – 28 కోట్ల 50 లక్షలు
21. బ్రహ్మోత్సవం – 27 కోట్లు
22. కత్తి – 26 కోట్లు
23. భైరవా – 25 కోట్ల 90 లక్షలు
24. నాన్నకు ప్రేమతో – 24 కోట్ల 50 లక్షలు
25. ఆగడు – 24 కోట్లు

పైన చెప్పిన లెక్కలన్నీ విశ్వసనీయమైన ట్రేడ్ సమాచారం మేరకు రూపొందినవి. ఓపెనింగ్స్ లో ఖైది నెంబర్ 150ని దాటేసిన భరత్ అనే నేను వీక్ ఎండ్ పూర్తయ్యాక ఎంత రచ్చ చేస్తాడో పూర్తి లెక్కలతో బయట పడనుంది. రెండేళ్ళ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ కావడంతో మహేష్ ఫాన్స్ ఆనందంతో గాల్లో తేలుతున్నారు. ఇరవై రోజుల క్రితం విడుదలైన రంగస్థలం సెట్ చేసిన రికార్డ్స్ దాటుతాడో లేదో ఇంకొంత కాలం వేచి చూడాలి