Begin typing your search above and press return to search.

భరత్ ఖాతాలో నాన్ బాహుబలి రికార్డులు

By:  Tupaki Desk   |   20 April 2018 4:53 PM GMT
భరత్ ఖాతాలో నాన్ బాహుబలి రికార్డులు
X
భరత్ అనే నేను మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. రావడం అంటే మామూలుగా కూడా కాదు.. ఫుల్ జోష్ తో వచ్చిన మహేష్.. ముందుగా ప్రామిస్ చేసినట్లుగానే గ్రాండ్ విక్టరీ కొట్టేయడం ఖాయం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రదర్శనలు టెలికాస్ట్ కాగా.. భారీ స్థాయిలో రిలీజ్ కావడం.. అదనంగా ఒక షో వేసుకునే సదుపాయం కల్పించడంతో.. భరత్ అనే నేను మూవీ రికార్డు ఓపెనింగ్స్ సాధించడం ఖాయం అయిపోయింది.

తొలి రోజున భరత్ అనే నేను మూవీ.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయంగా చెప్పేయచ్చు. మూవీకి టాక్ అద్భుతంగా ఉండడంతో.. ఫ్యాన్స్ ఖుషీగానే ఉన్నా ఇప్పుడు రికార్డులపై కన్నేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న ట్రెండ్ ప్రకారం.. నాన్ బాహుబలి రికార్డులు మహేష్ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనింగ్ డే రికార్డుల నుంచి.. వీకెండ్ వసూళ్ల వరకు భరత్ అనే నేను చిత్రానికి రికార్డులు దక్కడం ఖాయమని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఓవర్సీస్ లో సూపర్ గా పెర్ఫామ్ చేయడం మహేష్ మూవీస్ కు కామన్. గత రెండు చిత్రాలు డిజప్పాయింట్ చేసిన పరిస్థితిలో.. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాంచి ఆకలి మీద ఉన్నారు. వారి ఆశలన్నీ తీర్చేసే స్థాయి చిత్రంతో రావడంతో.. భరత్ అనే నేను చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ రికార్డు కలెక్షన్స్ ను కట్టబెట్టేస్తున్నారు ఫ్యాన్స్.