Begin typing your search above and press return to search.

సిఎం టార్గెట్ 100 కోట్లు పైనే

By:  Tupaki Desk   |   15 April 2018 12:33 PM GMT
సిఎం టార్గెట్ 100 కోట్లు పైనే
X
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. తన గత సినిమాల ఫలితాల ప్రభావం ఇంచు కూడా లేకుండా అంతకంతకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్న మహేష్ బాబు ష్యూర్ షాట్ హిట్ గా పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ సొంతం చేసుకున్న భరత్ నేను నేను విశ్వసనీయ సమాచారం మేరకు 100 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే పెట్టుబడి వెనక్కు వచ్చి లాభాలు మొదలు కావాలి అంటే వీలైనంత త్వరగా వంద కోట్ల షేర్ వచ్చేయాలి. హిట్ టాక్ వస్తే చాలు అది కొట్టడం ప్రిన్స్ కు ఏమంత కష్టం కాదు. ఈజీగా లాగేస్తాడు. ఓవర్సీస్ లో అవుట్ రైట్ గా 18 కోట్లకు సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజే 350 లొకేషన్లకు పైగా రెండు వేల ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం చూస్తే 3 మిలియన్ మార్క్ చేరుకోవడం పెద్ద విశేషమేమి కాదు. రామ్ చరణ్ రంగస్థలంతో అది పది రోజుల్లోనే అందుకున్నాడు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే భరత్ వారం లోపే లాగేస్తాడు.

ఇక ఏరియాల వారిగా జరిగిన ప్రీ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 22 కోట్లు

సీడెడ్ – 12 కోట్లు

ఉత్తరాంధ్ర – 8 కోట్ల 70 లక్షలు

ఈస్ట్ – 6 కోట్ల 70 లక్షలు

కృష్ణా మరియు గుంటూరు – 13 కోట్ల 60 లక్షలు

వెస్ట్ – 6 కోట్లు

నెల్లూరు – 3 కోట్లు

తెలుగు రాష్ట్రాలు (మొత్తం)- 72 కోట్లు

కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు – 9 కోట్లు

ఓవర్సీస్ – 18 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా – 99 కోట్లు

యావరేజ్ టాక్ వస్తేనే ఈజీగా 60 కోట్లు లాగేస్తున్న మహేష్ బాబు ముందే ప్రీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భరత్ అనే నేనుతో ఈ టార్గెట్ ని పెద్ద మార్జిన్ తో బీట్ చేస్తాడని అటు ఫాన్స్ తో పాటు ట్రేడ్ కూడా గట్టి హోప్స్ తోనే ఉంది. ఓవర్సీస్ ప్రీమియర్లు ఖరారు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఉంటాయి అనేదాని గురించి ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణాలో ఈ మధ్య అనుమతి ఇవ్వడం లేదు కాబట్టి ముందుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి