Begin typing your search above and press return to search.

భరత్ అనే నేను.. వాయిదా వేశారు

By:  Tupaki Desk   |   25 April 2018 5:30 PM GMT
భరత్ అనే నేను.. వాయిదా వేశారు
X
టాలీవుడ్ పై ఎవరెన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ ప్రేక్షకులకు నచ్చితే ఆ కామెంట్స్ ఏ మాత్రం పట్టించుకోరని అందరికి అర్ధమవుతోంది. భరత్ అనే నేను సక్సెస్ అందుకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఆ సినిమా సక్సెస్ చూస్తే.. నెగిటివ్ కామెంట్స్ టాలీవుడ్ లో ఎన్నో ట్రెండ్ అయినా కూడా వాటన్నిటినీ ఆడియెన్స్ తిప్పి కొట్టారు. ఏ మాత్రం వాటిని పట్టించుకోకుండా భరత్ అనే నేను సినిమాకు ఎగబడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు.

ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ దాటేశాయి. నిర్మాత డివివి. దానయ్య అలాగే అన్ని ఏరియాల బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వాళ్లకు త్రిబుల్ ప్రాఫిట్స్ వస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నారో మాటల్లో చెప్పడం కష్టం. ఇక వారికంటే ఎక్కువగా మహేష్ బాబు అయితే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. భరత్ అనే విజయం అందరికంటే ఎక్కువగా మహేష్ కే సంతోషాన్ని ఇచ్చింది. అందుకే సక్సెస్ మీట్ ను జరపాలని చిత్ర యూనిట్ తో చర్చలు జరిపారు.

తిరుపతి నగరంలో ఏప్రిల్ 27వ తేదీన గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సక్సెస్ మీట్ తేదీ వాయిదా పడింది. భారతీయ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఆ తేదీల్లో ఎక్కువగా తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం మరియు తుఫాను పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకే రిస్క్ వద్దని మరొక ప్లేస్ ని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని చిత్ర యూనిట్ తెలుపనుంది.