Begin typing your search above and press return to search.

మూడ్రోజులూ కుమ్మేసిన మహేష్

By:  Tupaki Desk   |   23 April 2018 1:22 PM GMT
మూడ్రోజులూ కుమ్మేసిన మహేష్
X
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో రిలీజ్ కు ముందునుంచే పాజిటివ్ బజ్ ఉండగా.. ఆ అంచనాలను మ్యాచ్ చేసేలా కంటెంట్ ఉండడంతో.. మూవీ వసూళ్లకు ఢోకా లేకుండా పోయింది.

మహేష్ గత చిత్రాలు సరిగా పెర్ఫామ్ చేయలేకపోవడంతో.. తొలి రోజున భారీ రికార్డులు నమోదు కాలేదు కానీ.. పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవడం.. వసూళ్లు నిలకడగా ఉండడంతో.. శని ఆదివారాలు ముగిసేసరికి చాలానే రికార్డులు భరత్ ఖాతాలోకి చేరిపోయాయి.

తొలి వీకెండ్ ముగిసేసరికి భరత్ అనే నేను షేర్

నైజాం 10. 20 కోట్లు
సీడెడ్ 5.50 కోట్లు
ఉత్తరాంధ్ర 5.18 కోట్లు
ఈస్ట్ 4.42 కోట్లు
వెస్ట్ 2.63 కోట్లు
కృష్ణా 3.38 కోట్లు
గుంటూరు 5.57 కోట్లు
నెల్లూరు 1.42 కోట్లు
ఆంధ్ర 22.60 కోట్లు
యూఎస్ఏ 9.08 కోట్లు
కర్నాటక 5.80 కోట్లు
యూఏఈ ప్లస్ గల్ఫ్ 1.35 కోట్లు
తమిళనాడు 0.87 కోట్లు
ఆస్ట్రేలియా 0.90 కోట్లు
ఇతర ప్రాంతాలు 1.10 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ 57.4 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల నుంచే తొలి మూడు రోజుల్లో 38.3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే.. భరత్ దూకుడు అర్ధం అవుతుంది. మొత్తం గ్రాస్ 93 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. అయితే.. యూఎస్ లో గ్రాస్ లో షేర్ తక్కువగా ఉండడానికి కారణం.. భారీ రిలీజ్ చేయడమే.

మహేష్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ కాగా.. పలు ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు నమోదయ్యాయి. అయితే.. ఈ చిత్రాన్ని భారీ రేట్లకు విక్రయించారు. వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ విలువ 100 కోట్లు కావడంతో.. భరత్ అనే నేను హిట్టు తీరాన్ని చేరడానికి.. వీక్ డేస్ కూడా ముఖ్యమే. కలెక్షన్స్ నిలకడగా కంటిన్యూ కావాల్సిన అవసరం ఉంది. వచ్చేవారం రిలీజ్ కావాల్సిన రజినీకాంత్ మూవీ కాలా పోస్ట్ పోన్ కావడం.. కలిసొచ్చే విషయమే.