భరత్ సెన్సార్ రిపోర్ట్

Mon Apr 16 2018 18:33:39 GMT+0530 (IST)

భరత్ అనే నేను సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. యాక్షన్ డోస్ కూడా ఉంది కాబట్టి యు/ఎ తో సర్టిఫికేట్ తెచ్చేసుకుంది. లెంగ్త్ విషయంలో కొరటాల శివ-మహేష్ బాబు రాజీ పడలేదు. మొత్తం రన్ టైం 173 నిమిషాల కాపీని సెన్సార్ కు ఇచ్చారు. అంటే 3 గంటలకు జస్ట్ ఏడు నిముషాలు తక్కువ అంతే. ఈ లెక్కన రంగస్థలం ఘన విజయం ఇచ్చిన కాన్ఫిడెన్సో లేక సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లో మూడు గంటలైనా కూర్చుంటారనే నమ్మకమో కాని మొత్తానికి భరత్ అనే నేను పాలన మూడు గంటల సేపు ఎంజాయ్ చేయొచ్చు. చూచాయగా తెలిసిన టాక్ ని బట్టి భరత్ అనే నేను అవుట్ అండ్ అవుట్ మహేష్ వన్ మ్యాన్ షో అని తెలిసింది. ఇంత వరకు చేయని పాత్రలో చాలా డిగ్నిఫైడ్ గా సూపర్ సాలిడ్ గా ఉన్నాడని ఇన్సైడ్ టాక్.స్లోగా స్టార్ట్ చేసి ఉమ్మడి రాష్ట్ర రాజకీయల్లోకి మహేష్ బాబు అడుగు పెట్టినప్పటి నుంచి టెంపో మామూలుగా ఉందట. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. మొత్తానికి సెన్సార్ రిపోర్ట్ ఫాన్స్ ని గాల్లో తేలేలా చేస్తోంది. ఒక్క సింగల్ కట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. కొరటాల శివ గత సినిమాల్లో కూడా వయోలెన్స్ ఉన్నప్పటికీ మంచి మెసేజ్ తో పాటు హీరోయిజం ను ఎలివేట్ చేయటం అతని స్టైల్. ఇందులో అది పదింతలు ఎక్కువగా చూపించారని శ్రీమంతుడి కన్నా ఎన్నో రెట్లు ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటుందని యూనిట్ ధీమాగా ఉంది. శరత్ కుమార్- ప్రకాష్ రాజ్-పోసాని కృష్ణమురళి కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ ద్వారా కైరా అద్వానీ హీరొయిన్ గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.