Begin typing your search above and press return to search.

వరుడు భామ ఇంకా ట్రై చేస్తోంది

By:  Tupaki Desk   |   1 Dec 2015 10:30 PM GMT
వరుడు భామ ఇంకా ట్రై చేస్తోంది
X
వరుడు సినిమాలో అల్లు అర్జున్ సరసన కనిపించిన ముద్దుగుమ్మ గుర్తుందా ? అదేనండీ భానుశ్రీ మెహ్రా. కలర్ - కటింగ్ లు బాగానే ఉన్నా.. అమ్మడికి అప్పుడు అదృష్టం కలిసిరాలేదు. దీనికి తోడు వరుడు దర్శకుడు గుణశేఖర్ అనుసరించిన స్ట్రాటజీ కూడా బాగానే దెబ్బేసింది. మొహం చూపించకుండానే సినిమా తీసేయండతో.. ప్రచారంలో భాగం కాలేకపోయింది. జనాలకు దగ్గర కాలేకపోయింది. మూవీకి బ్యాడ్ టాక్ రావడంతో.. పట్టించుకోవాల్సిన అవసరం జనాలకు లేకపోయింది.

తర్వాత అరకొరా తమిళ్ - పంజాబీ మూవీస్ చేసిన భానుశ్రీ.. గతేడాది రామ్ చరణ్ అమ్మగా కూడా చేసింది. అవునా అంటారా.. గోవిందుడు అందరివాడేలే సినిమాలో తండ్రి పాత్ర చేసిన రెహమాన్.. ఓ అమ్మాయిని తీసుకుని నా లవర్ అంటాడు చూశారా.. ఆమె భానుశ్రీ మెహ్రానే. అలా మరోసారి మెగాక్యాంప్ లో చిన్నదైనా ఓరోల్ చేసిన ఈమె.. ఇప్పుడ మళ్లీ టాలీవుడ్ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.

రీసెంట్ గా ఓ ఫోటోషూట్ చేసింది భానుశ్రీ మెహ్రా. ముప్ఫై రావడానికి మరో ఏడాదే ఉన్నా... తనలో సొగసులు చాలా ఉన్నాయని చెప్పకనే చెప్పింది. బ్యాక్ లెస్ పోజులు కూడా ఇచ్చింది. కట్టుబొట్టూ మార్చి, రకరకాల యాంగిల్స్ లో.. తెగ సందడి చేసింది. ఇన్ని చేశాకైనా.. ఎవరైనా డైరెక్టర్ కరుణిస్తాడేమో చూడాలి.