Begin typing your search above and press return to search.

నా ఎలిమినేష‌న్ కు కార‌ణం అదే..భానుశ్రీ‌!

By:  Tupaki Desk   |   22 July 2018 8:08 AM GMT
నా ఎలిమినేష‌న్ కు కార‌ణం అదే..భానుశ్రీ‌!
X
బిగ్ బాస్ -2లోని కంటెస్టెంట్ల‌లో న‌టి భానుశ్రీకి మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి బిగ్ బాస్ విన్న‌ర్ గా భానుశ్రీ నిలుస్తుంద‌ని ప్రేక్ష‌కులు భావించారు. హౌస్ లో అంద‌రితోనూ క‌లిసిపోయిన భానుశ్రీ ....అనూహ్యంగా గ‌త వారం ఎలిమినేట్ అయింది. అయితే, తాను చేసిన త‌ప్పువ‌ల్లే షో నుంచి ఎలిమినేట్ అయ్యాన‌ని భానుశ్రీ చెప్పింది. త‌న త‌ప్పు వ‌ల్ల ఓ టాస్క్‌లో కౌషల్ తో గొడ‌వైంద‌ని - అపుడు త‌న‌కు మైనస్‌ మార్క్స్‌ పడ్డాయని చెప్పింది. దాంతోనే తాను ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. బిగ్‌ బాస్ లో పాల్గొనడం త‌న అదృష్ట‌మ‌ని - ఆ షో త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని భానుశ్రీ చెప్పింది. అంతా అనుకున్న‌ట్టు ఈ గేమ్ లోని పార్టిసిపెంట్స్ డైరెక్ష‌న్ ప్ర‌కారం న‌డుచుకోర‌ని.....ఇది నిజాయితీగా ఉండే రియాల్టీ షో అని చెప్పింది. తాను చాలా సూటిగా మాట్లాడ‌తాన‌ని - అందుకే అంద‌రూ త‌న‌ను అభిమానించేవార‌ని చెప్పింది. ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భానుశ్రీ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

త‌న‌ అసలు పేరు స్వప్నఅని - డ్యాన్సర్ అయిన త‌ర్వాత భానుశ్రీగా పేరు మార్చుకున్నాన‌ని చెప్పింది. కొరియోగ్రాఫర్ కావాల‌నేది త‌న క‌ల అని - ఇంట్లో ఒప్పుకోక‌పోవ‌డంతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చి ఉంటున్నాన‌ని చెప్పింది. డ్యాన్సర్ గా శక్తి - డార్లింగ్‌ తదితర సినిమాలకు పనిచేశానని చెప్పింది. ఆ త‌ర్వాత కొన్ని షోలు - సీరియ‌ళ్ల‌లో పాల్గొన్నాన‌ని...బాహుబ‌లి - కుమారి 21ఎఫ్ -కాటమరాయుడు - సుబ్రమణ్యం ఫర్‌ సేల్ - మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించానని చెప్పింది. ఇద్దరి మధ్య 18 - మౌనం - ఆవుపులి మధ్యలో ప్రభాస్‌ పెళ్లి తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చాన్స్ వ‌చ్చింద‌ని తెలిపింది. బాహుబలి త‌ర్వాత వరంగల్‌ లో సన్మానం జ‌ర‌గ‌డం ఆనందాన్నిచ్చింద‌ని చెప్పింది. డ్యాన్సర్ గా ఉన్నప్పుడు శివశంకర్‌ రెడ్డితో పరిచయమైంద‌ని - త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నామ‌ని చెప్పింది. ప్రస్తుతం తెలుగు - కన్నడ మూవీలో హీరోయిన్‌ గా చేస్తున్నానని తెలిపింది.