Begin typing your search above and press return to search.

భలే మంచి రోజు అంటున్న సుధీర్

By:  Tupaki Desk   |   30 July 2015 10:18 AM GMT
భలే మంచి రోజు అంటున్న సుధీర్
X
విజయాలు లేని సుదీర్ ఈ పాత పాడుతున్నాడా అనుకోకుండా.. ఈ మేటర్ పై ఓ లుక్ వేయండి. నటుడిగా అరంగేట్రం చేసి అయిదేళ్ళు కావస్తున్నా సుధీర్ హీరోగా కంటే మహేష్ బావగానే ఫేమస్. ఇప్పటివరకు తన కెరీర్లో ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. క్రైమ్ కామెడీ జోనర్ బావుందని అదే ప్రయత్నించి మామగారి టైటిల్ తో మోసగాళ్ళకు మోసగాడు చేశాడు. ఆ ఫలితం మనోడి దగ్గర వున్న కాస్త నవ్వుని తీసుకెళ్ళి పోయింది. తర్వాత వచ్చిన కృష్ణమ్మ కలిపింది విజయం సాధించలేదన్నది ఒప్పుకుని తీరాల్సిందే.

విజయం వరించె ఓ మంచి రోజు కోసం అదే పని ఎదురుచూస్తున్న సుధీర్ తన తర్వాతి సినిమాకి 'భలే మంచి రోజు' అంటే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాని నిర్మిస్తున్నది సుధీర్ బాబు చెడ్డీ దోస్తులైన శశి-వంశీలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమాతో సుధీర్ కి మంచి రోజులు వస్తాయా లేదా అనేది సెప్టెంబర్ లో తెలియనుంది. ఈ సినిమా విడుదలయ్యేది అప్పుడే మరి.