Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ కొట్టింది నేనేనా ?- నాని

By:  Tupaki Desk   |   10 Oct 2015 1:30 PM GMT
బ్లాక్ బస్టర్ కొట్టింది నేనేనా ?- నాని
X
నానితో మారుతీ తీసిన భలేభలే మగాడివోయ్ సాధించిన విజయం తిరుగులేనిది. చాలా మూవీలకు బెంచ్ మార్క్ సెట్ చేసి.. చిన్న చిత్రాలకు రాజమౌళిలాంటి దర్శకుడనే కీర్తిని మారుతికి అందించింది. కెరీర్ లో అత్యంత దిగువ స్థాయికి పడిపోయిన నానిని.. ఏకంగా స్టార్ హీరోని చేసేసింది. అయితే.. ఈ మూవీ ఇంతగా హిట్ అవుతుందని నాచురల్ స్టార్ అనుకోలేదట.

కంటెంట్ బాగుంది, మంచి హిట్ అవుతుందని అనుకున్నాను కానీ... ఓవర్సీస్ లో టాప్ టెన్ గ్రాసర్స్ లో ఒకటిగా ఏడో స్థానంలో నిలిచేంతటి హిట్ కొడుతుందని ఊహించలేదట. ఇదంతా బాహుబలి చలవే అంటున్నాడు నాని. ఇప్పుడు జనాలు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గించేశారని.. థియేటర్లలోనే సినిమా చూడాల్సిన అవసరమేంటో బాహుబలి ద్వారా జక్కన్న చెప్పాడని అన్నాడు నాని. గతంలో పక్క ఊరికి వెళ్లడం కూడా కష్టమనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు కూడా ఈజీగా వెళ్లొచ్చేస్తున్నాం.

సినిమాకూడా ఇలాగే అభివృద్ధి చెందింది అంటున్నాడు. భలేమగాడికి ఇంతగా సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు.. దేశంలోనూ, అమెరికాలోనూ టూర్ చేయబోతున్నారట యూనిట్. విజయం కోసం సక్సెస్ టూర్లు చేయడం పాత విషయమే కానీ.. సక్సెస్ కొట్టాక థాంక్యూ టూర్ మాత్రం భలేమగాడితోనే మొదలయ్యే కొత్త ట్రెండ్ అనుకోవచ్చు.