Begin typing your search above and press return to search.

రంగస్థలంకు షాకిచ్చిన భాగమతి..

By:  Tupaki Desk   |   6 July 2018 11:35 AM GMT
రంగస్థలంకు షాకిచ్చిన భాగమతి..
X
సినిమా కలెక్షన్ల రికార్డు ఉంటుంది.. అవార్డులు అందుకున్న రికార్డు ఉంటుంది.. కానీ ఇప్పుడు కొత్తగా పైరసీ రికార్డు వచ్చేసింది.. ఇందులో తాజాగా రంగస్థలం చిత్రాన్ని అధిగమించి అనుష్క నటించిన భాగమతి చిత్రం తొలిస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది పైరసీలో ఎక్కువమంది చూసిన చిత్రంగా ‘భాగమతి’ రికార్డు సృష్టించింది. ఆ తరువాత స్థానంలో రాంచరణ్ ‘రంగస్థలం’ ఉంది.

జర్మనీకి చెందిన తెసీక్సిపికో అనే సంస్థ తెలుగులో ఎక్కువగా పైరసీ బారిన పడ్డ చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేసింది. తొలి పదిస్థానాలను ఆక్రమించిన తెలుగు చిత్రాలు.. ఎంత మంది వాటిని పైరసీలో చూశారనే వివరాలను వెల్లడించింది.

*అనుష్క నట విశ్వరూపం చూపిన ‘భాగమతి’ చిత్రాన్ని పైరసీ రూపంలో 1.9 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకొని చూశారు. ఈ ఏడాది పైరసీలో భాగమతిదే అగ్రస్థానం

* సమ్మర్ లో విడుదలై అతిపెద్ద విజయం సాధించిన రంగస్థలం మూవీని పైరసీలో రెండో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రాన్ని 1.6 మిలియన్ల మంది పైరసీలో డౌన్ లోడ్ చేసుకొని చూశారు.

*కొరటాల శివ-మహేష్ బాబు కాబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను అంచనాలకు మించి హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని 1.6 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకొని పైరసీ కాపీని చూసేశారు.

*సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రాన్ని పైరసీలో 1.4 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకొని చూశారు.

*రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహించి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని కూడా 1.2 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకొని చూడడం విశేషం.

* వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన రోమాంటిక్ లవ్ స్టోరీ ‘తొలిప్రేమ’ కూడా పైరసీ బారిన పడింది. ఈ చిత్రాన్ని 1 మిలియన్ మంది చూశారు.

* యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘చలో’ చిత్రాన్ని 8 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొని పైరసీ కాపీని చూశారు.

*పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా నిరాశపరిచిన ‘అజ్ఞాతవాసి’ మూవీని కూడా పైరసీ బారిన పడింది.. దీన్ని 8 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొని చూశారు.

*గత సంక్రాంతికి విడుదలైన బాలక్రిష్ణ జైసింహా చిత్రాన్ని 8 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొని చూశారు.

*మాస్ మహారాజా ప్రతిష్టాత్మకంగా తీసిన ‘టచ్ చేసి చూడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రాన్ని 7 లక్షల మంది పైరసీలో డౌన్ లోడ్ చేసుకున్నారు.