Begin typing your search above and press return to search.

లోదుస్తుల్లో యోగా డే ఏంటండీ బాబూ

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:47 AM GMT
లోదుస్తుల్లో యోగా డే ఏంటండీ బాబూ
X
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాయి. అనేక మంది యోగ ఉపయోగాలను తెలియచేస్తే.. మరికొంత పక్కాగా తమను తాము ప్రచారం చేసుకునేందుకు ఈ కాన్సెప్ట్ ను ఉపయోగించుకున్నారు.

పలువురు అందాల భామలు యోగ డే స్పెషల్ అంటూ.. తమ స్టైల్ లో ఫోటోలు పెట్టి అభిమానులను అలరించారు. పూనమ్ పాండే నుంచి బిపాషా బసు వరకూ.. తమ యోగాసనాలు ఎలా ఉంటాయో ఎంతో అందంగా చూపించారు. టీవీ సీరియల్స్ లో నటించే భామ అనేరి వజని కూడా యోగా డేను ఇలాగే సెలబ్రేట్ చేసుకుంది. ఈమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే కాదు.. వివాదాస్పదం కూడా అయిపోయింది. కేవలం లింగరీలో ఉన్న పిక్ ను షేర్ చేయడాన్ని నెటిజన్లు తప్పు పట్టారు. యోగా డేను ఇలా ఉపయోగించుకోవడం తప్పు అని తేల్చేశారు కూడా. అయితే.. ఈ వివాదంపై స్పందించిన అనేరి మాత్రం.. ''నా ఫోటో నా ఇష్టం. షేర్ చేశాను. అది కూడా నా ఇష్టమే. మీకు నచ్చితే చూడండి.. నచ్చకపోతే మానేయండి'' అంటూ కామెంట్ చేసింది.

అయితే.. ఇలా ఆన్ లైన్ లో సెక్సీ ఫోటోలను పెట్టి తిట్లు తిన్న జాబితా గతంలో కూడా ఉంది. నియా శర్మ.. రుబినా దిలాయక్.. సోనారికా భడోరియాలు కూడా ఈ తరహా గార్మెంట్స్ లో ఫోటోలను షేర్ చేసి.. సోషల్ మీడియా జనాలతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీరిలో చాలా మంది.. మై బాడీ మై రైట్ అంటూ ఈ విమర్శలను తిప్పికొట్టేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/