Begin typing your search above and press return to search.

బెంగాల్ టైగర్ కలిపి కొడుతున్నాడు

By:  Tupaki Desk   |   30 Nov 2015 5:30 PM GMT
బెంగాల్ టైగర్ కలిపి కొడుతున్నాడు
X
సినిమాలకు ప్రమోషన్ ఎంత ముఖ్యమో మన స్టార్ హీరోలకు ఈ మధ్య బాగానే తెలిసొస్తోంది. ఇంతకుముందు మీడియా ముందుకు రావడానికి.. సినిమాని ప్రమోట్ చేయడానికి తెగ మొహమాట పడేవాడు మహేష్ బాబు. కానీ ఈ మధ్య తన సినిమాల్ని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడో చూస్తున్నాం. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేష్ అగ్రెసివ్ ప్రమోషన్ చాలా బాగా ఉపయోగపడింది. మిగతా హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారిప్పుడు. రవితేజ తన ‘కిక్-2’ సినిమాను బాగా ప్రమోట్ చేశాడు. అతడి కొత్త సినిమా ‘బెంగాల్ టైగర్’కు ఇంకా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే హీరోయిన్లతో ఓ దఫా ప్రమోషన్ చేయించి.. రిలీజ్ డేట్ మారడంతో కొంచెం కామ్ అయిన ‘బెంగాల్ టైగర్’ టీం.. విడుదలకు ఇంకో పది రోజులే సమయం ఉండటంతో జోరు పెంచింది. ‘సైజ్ జీరో’ స్ఫూర్తితో బస్సులు, రైళ్లలో భారీగా పోస్టర్ పబ్లిసిటీ చేస్తున్నారు. ‘సైజ్ జీరో’ తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే అన్ని రైళ్లలో ‘బెంగాల్ టైగర్’ పోస్టర్లను నింపేశారు. దీంతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ- టీఎస్ ఆర్టీసీ బస్సులన్నింటిపైనా భారీగా పోస్టర్లు అంటించారు. మొత్తానికి ప్రమోషన్ చాలా అగ్రెసివ్ గానే సాగుతోంది. విడుదలకు ముందు వారమంతా హీరో హీరోయిన్లను డైరెక్టర్ని రంగంలోకి దించి ప్రమోషన్ చేయించబోతున్నారు. మాంచి మాస్ మసాలా సినిమా కావడంతో ‘బెంగాల్ టైగర్’కు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది.