Begin typing your search above and press return to search.

టైగర్ కొత్త ఐడియా వేశాడు..

By:  Tupaki Desk   |   13 Oct 2015 5:30 PM GMT
టైగర్ కొత్త ఐడియా వేశాడు..
X
కిక్2 డిజాస్టర్ తర్వాత స్పీడ్ పెంచిన మాస్ మహరాజా.. ఎలాగైనా సక్సెస్ సాధించాలనే కసితో ఉన్నాడు. మామూలుగానే రవితేజ ఎనర్జీ లెవెల్స్ హై స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది కిక్2 అనుకోని విధంగా షాక్ ఇవ్వడంతో.. మరింతగా రెచ్చిపోయాడట బెంగాల్ టైగర్ లో. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ దీపావళికి థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కి మరో మూడు వారాల గడువే ఉండడంతో ప్రమోషన్ కిక్ స్టార్ట్ చేసేస్తున్నారు.

బెంగాల్ టైగర్ టీజర్ ను అక్టోబర్ 14న విడుదల చేయబోతున్నారు. టీజర్ అంటే సాధారణంగా యూట్యూబ్ లోనో, టీవీల్లోనో రిలీజ్ చేస్తుంటారు. కానీ బెంగాల్ టైగర్ కి కొత్త స్కెచ్ వేశారు. టీజర్ ని ఎఫ్ ఎం రేడియోలో విడుదల చేస్తుండడం విశేషం. ఇలా రేడియోలో పాటలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ.. ఇంత ధైర్యంగా టీజర్ ని రేడియోలో లాంఛ్ చేస్తున్నారంటే.. ఖచ్చితంగా డైలాగ్స్ మీద బేస్ అయిన టీజర్ అని అర్ధమవుతుంది. పంచ్ డైలాగ్స్ విసరడంలో దర్శకుడు సంపత్ నందికి మంచి ఎక్స్ పీరియన్సే ఉంది. రామ్ చరణ్ రచ్చతో దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు కూడా.

ఇప్పుడు సంపత్ కి హై ఓల్టేజ్ మాస్ మహరాజా తోడయ్యాడు. ఇంకా పవర్ ఫుల్ డైలాగ్స్, పంచ్ లు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజకు తమన్నా జంటగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వీటికి ఏ మాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని.. భరోసా ఇచ్చేస్తున్నాడు సంపత్ నంది.